118 సినిమా కళ్యాణ్ రామ్ కి మరో ?

118 సినిమా కళ్యాణ్ రామ్ కి మరో ?

118 సినిమా కళ్యాణ్ రామ్ కి మరో

 

పటాస్ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ కి మరో హిట్ సినిమా లేదు అనే చెప్పాలి. పటాస్ సినిమా కలెక్షన్స్ పరంగా చుసిన కళ్యాణ్ రామ్ కి ఇదే అతిపెద్ద హిట్ అని చెప్పాలి. తరువాత కళ్యాణ్ నటించిన చిత్రాలేవీ ఆడలేదని చెప్పాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా ఈ నెల మార్చ్ 1 2019 న విడుదలైన సంగతి మనఅందరికి తెలిసిందే. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఉపయోగపడిందా లేదా చూద్దాం.

118 సినిమా ఒక త్రిల్లర్ సినిమా అనే చెప్పాలి ఈ సినిమా k.v గుహన్ కి మొదటి సినిమా ఈ సినిమా కి ఇతనే దర్శకుడు , రచయిత, కెమెరా వర్క్ మరియు స్క్రీన్ ప్లే. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తం ఇతనిదే.

కథ విషయానికి వస్తే గౌతమ్ (కళ్యాణ్ రామ్ ) ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఇతను ఒక పనిమీద ఒక రిసార్ట్ లో బస చేస్తాడు రూమ్ నెంబర్ 118 లో. రాత్రి కలలో ఒక అమ్మాయి ని ఎవ్వరో బాగా కొట్టి తన కార్ ని చెరువులో పడవెయ్యటం కల కంటాడు. లేచిన తరువాత ఇదే కల రెండు నెలల క్రితం ఇదే రూమ్ లో ఇతని కి రావటం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది స్వతహాగా జర్నలిస్ట్ ఐన గౌతమ్ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయటం మొదలుపెడతాడు. ఇది కథ

 

118 సినిమా కళ్యాణ్ రామ్ కి మరో
దర్శకుడు గుహన్ ఈ సినిమాకి కొంచెం కేర్ తీసుకున్నాడని చెప్పవచ్చు. కెమెరా వర్క్ కధనం ఒకింత పర్వాలేదనిపించింది. కళ్యాణ్ రామ్ నటన సినిమా కి ప్లస్ పాయింట్.

మొత్తానికి సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుందని చెప్పవచ్చు. సినిమా కలెక్షన్స్ పరంగా కూడా పర్వాలేదనిపించింది.

ప్లస్ పాయింట్స్:
కళ్యాణ్ రామ్
స్క్రీన్ ప్లే
కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్:
కథ సాగతీత
పాటలు

Telugu Vilas Rating : 3 / 5

118 MOVIE REVIEW Kalyan Ram

Kalyanram New Movie  review and collections analysis. movie review total collections. Guhan latesh movie

http://www.teluguvilas.com/mahesh-babu-maharshi-release/