20 ఏళ్ల యువ‌తి అసెంబ్లీ ర‌హ‌దారిపై నిల‌బ‌డి ఉండ‌గా.. అత్యాచారం..!

నేటి రోజుల్లో జ‌రుగుతున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు ఊహ‌కంద‌ని రీతిలో చోటు చేసుకుంటున్నాయి. ఆ త‌ర‌హా ఘ‌ట‌నే రాయ్‌పూర్ లోనూ చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువ‌తిపై ఓ యువ‌కుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. సంఘ‌ట‌న‌కు సంబంధించి కేసు న‌మోదు చేసుకున్న కమ‌ర్దిహ్ ప్రాంత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

డోంగార్ గావ్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువ‌తి రాయ్‌పూర్‌కు చేరుకుని ఉపాధి కోసం ఆరా తీస్తుండగా.., స‌రిగ్గా అసెంబ్లీ వ‌ద్ద నిల‌బ‌డి ఉన్న ఆ యువ‌తిని నిందితుడైన యువ‌కుడు ఆమెకు ఉపాధి చూపిస్తానంటూ నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీంతో ఆ మ‌హిళ ఆ యువ‌కుడి నుంచి త‌ప్పించుకుని క‌మ‌ర్దిహ్ ప్రాంత పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నిందితుడు నార్ధాలో నివసిస్తున్న యువకుడి పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

బాధితురాలు గ‌త ఆరు నెల‌ల క్రితం రాయ్‌పూర్ శంకర్ నగర్ ప్రాంతంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేసి, ఆ త‌రువాత నివాస ప్రాంత‌మైన డోంగార్ గావ్‌కు వెళ్లిందని, ఆమె మ‌ళ్లీ ఉపాధి నిమిత్తం రాయ్‌పూర్‌కు వ‌చ్చి అసెంబ్లీ రహదారిపై నిలబడి ఉండగా, నిందితులు అక్కడికి చేరుకుని, ప‌నిచూపిస్తామంటూ మాయ మాట‌ల‌తో బైక్‌పై ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని పోలీసులు వెల్ల‌డించారు.