నా రొమాన్స్‌ రజనీకాంత్‌తోనే

 

‘‘రోబో 2.ఓ “ఈ మూవీ చాలా కోట్లు తో కుడి ఉన్న సినిమా అంత పెద్ద సినిమా తెలుగు లో ఏ ప్రమోషన్ చేయడం లేదు అనుకుంటు ఉన్న సమయంలో నిన్న సోమవారం హైదరాబాద్ ప్రెస్ మీట్ జరిగింది రజినీకాంత్ గారు మాట్లాతు నాతొలి చిత్రం విడుదల తేదీ కోసం ఆసక్తిగా, ఆత్రుతతో ఎదురుచూశా. 43ఏళ్ల తరవాత ‘2.ఓ’ కోసం అలానే ఎదురుచూస్తున్నాను. భారతీయ చిత్రసీమకే గర్వకారణం ఈ చిత్రం’’అన్నారు రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘2.ఓ’. శంకర్‌ దర్శకుడు. అక్షయ్‌కుమార్‌ కీలక పాత్రధారి. లైకా భాస్కరన్‌ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘తెలుగువాళ్లు చాలా మంచివాళ్లు. తెలుగు భోజనం లోక ప్రసిద్ధి. తెలుగు సంగీతం వింటే ఆనందం కలుగుతుంది. తెలుగు అమ్మాయిల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ‘రోబో’ని త్రీడీలో చేద్దామనుకున్నాం. కుదర్లేదు. ఒక్కరీలైనా త్రీడీలో చూసుకోవాలన్న కోరిక కలిగింది. ‘మంచి కథ దొరికితే త్రీడీలో ఓ సినిమా చేయాలి’ అని శంకర్‌ చెప్పారు. మూడేళ్ల క్రితం ఈ కథ నా దగ్గరకు తీసుకొచ్చారు. శంకర్‌ ఓ మాంత్రికుడు. ‘బాహుబలి’ విజయానికి కారణం కథ. ఆ కథకు తగినట్టు బ్రహ్మాండంగా తీశారు. ‘2.ఓ’లో టెక్నాలజీతో పాటు దానికి సరిపోయే కథ దొరికింది. అందుకే ఇది బాగా ఆడుతుందని నా నమ్మకం. ఇప్పటి వరకూ చూసింది ట్రైలరే. ఆశ్చర్యపోయే సంగతులు చాలా ఉన్నాయ’’న్నారు. శంకర్‌ మాట్లాడుతూ ‘‘ఇదో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌, థ్రిల్లర్‌. భావోద్వేగాలతో పాటు మంచి కథ ఉంది. క్లైమాక్స్‌ దిల్లీలో తీశాం. అప్పుడు 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందక్కడ. 40 రోజుల పాటు షూటింగ్‌ చేయాలి. అప్పుడు రజనీ ఆరోగ్యం బాగాలేదు. షూటింగ్‌ ఆగిపోతే నష్టం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకుని రజనీ సెట్‌కి వచ్చారు. అక్షయ్‌ మేకప్‌కే రెండు గంటలు పట్టేది. ఆరు నెలల ముందే రెహమాన్‌ నేపథ్య సంగీతం మొదలెట్టారు. ఓ భారతీయ చిత్రానికి ఈస్థాయి బడ్జెట్‌ ఎవరూ పెట్టరు. సినిమాపై అభిరుచితోనే అంత ఖర్చు చేశారు. మన దేశంలోనూ ఇలాంటి సినిమాలు చేయొచ్చని ప్రపంచానికి చాటి చెప్పొచ్చు. ఈ సినిమాని త్రీడీలో చూడండి. 2డీలో కంటే పది రెట్లు బాగుంటుంద’’న్నారు. అక్షయ్‌కుమార్‌ మాట్లాడుతూ‘‘ఇన్నేళ్ల నుంచీ పరిశ్రమలో ఉంటున్నా. ఇంతగా ఎక్కడా నేర్చుకోలేదు. అవకాశం ఇచ్చిన శంకర్‌కి కృతజ్ఞతలు. రజనీ పక్కన విలన్‌గా నటించడం ఓ గౌరవం. ఈ సినిమా చూడలేదు. విడుదలయ్యాక చూడాలని కుతూహలంగా ఉంద’’న్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నాలుగేళ్లు కష్టపడి శంకర్‌ సృష్టించిన అద్భుత చిత్రమిది’’అన్నారు.