కేసీఆర్ ‘రిటర్న్ గిఫ్ట్’ రీయాక్షన్ ‘ఆ నేత’ రాజకీయాలకు ‘గుడ్ బై’

 

kcr,chandrababu

తెలంగాణ ఎన్నికలు జరిగిన సమయంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేసి గోరా పరాజయాన్ని ఎదురుకున్నాడు చంద్రబాబు. అయితే రాష్ట్రం కానీ రాష్ట్రంకు వచ్చి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండటం వలన కేసీఆర్ మండిపోయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నీకు పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని సవాలు విసిరాడు కెసిఆర్..

దింతో ఓ టీడీపీ ఎమ్మెల్యే రిటర్న్ గిఫ్ట్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని ఆయన ప్రకటించారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోమవారం నాడు గుంటూరులో మీడియాతో మాట్లాడారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ నాయకుడిగా కాకుండా దిగజారుడుగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. నీతి నిజాయితీలు లేని వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని, ఆలా మాట్లాడటం తగ్గించుకుంటే మంచిది అని చెప్పారు. మరి టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆలపాటి రాజకీయాలకు రాజీనామా చేస్తాడు ఏమో చూడాలి. మాట మీద నిలబడుతాడా లేక హామీలు పక్కన పెట్టినట్టు ఇచ్చిన మాటా కూడా పక్కన పెడుతారా అనేది చూడాలి.