CIBIL స్కోర్ అవసరం లేకుండానే క్రెడిట్ కార్డు ఇస్తున్న అమెజాన్..

 

amazon credit cardక్రెడిట్ కార్డుల వాడకం రోజురోజుకి పెరిగిపోతుంది అందుకే ఇప్పుడు కేవలం బ్యాంకులు మాత్రమే కాకుండా ఎన్‌బీఎఫ్‌సీలు పేమెంట్ బ్యాంకులు మరియు ఇతర సంస్థలు కూడా వారి కస్టమర్స్ కోసం క్రెడిట్ కార్డులను లాంచ్ చేస్తున్నాయి మొన్నీ మధ్యే “పేటీఎం” మరియు “ఓలా” సంస్థలు కూడా క్రెడిట్ కార్డులను లాంచ్ చేసాయి ఇప్పుడు తాజాగా వీటి జాబితాలోకి అమెజాన్ కూడా వచ్చి చేరింది అమెజాన్ కూడా తమ యొక్క క్రెడిట్ కార్డులను ఆవిష్కరించింది

CNBC ఇచ్చిన నివేదిక ప్రకారం జెఫ్ బెజోస్ సారథ్యంలోని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా క్రెడిట్ కార్డులను లాంచ్ చేసింది ఇందుకోసం సింక్రోనీ ఫైనాన్షియల్ అనే బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అయితే తొలిసారిగా అమెరికా పౌరులకు ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది

అమెజాన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే క్రెడిట్ స్కోర్ లేనివారికి సాధారణ బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇవ్వవు కాబట్టి అలాంటి వారే లక్ష్యంగా అమెజాన్ ఈ క్రెడిట్ కార్డులను ఆవిష్కరించింది ఈ కార్డు పేరు అమెజాన్ క్రెడిట్ బిల్డర్ కార్డు రెగ్యులర్ క్రెడిట్ కార్డు పొందలేని వారికి మరియు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి కూడా ప్రస్తుతం అమెజాన్ ఈ కార్డులను జారీ చేయవచ్చు అలాగే దీనితో మన యొక్క క్రెడిట్ స్కోరును కూడా పెంచుకోవచ్చట

amazon credit card