ప్రదీప్ రెమ్యూనరేషన్ కోసం ఢీ మానేయలేదు….యాంకర్ రవి!

నెంబర్ వన్ మెయిల్ యాంకర్ బుల్లి తెర పై ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రదీప్ మాచిరాజు. తన సొంతమైన డిఫరెంట్ యాంకరింగ్ తో ప్రేక్షకుల మదిని దోచే చేస్తుంటాడు ప్రదీప్. ప్రదీప్ మాటల్లో కొంచం కూడా వల్గారిటీ లేకుండా మాట్లాడుతూ, యాంకరింగ్ అనే పేరుకి మారు పేరుగా మారిపోయాడు ప్రదీప్. తనదైన స్టైల్ లో ఇప్పటికే ఎన్నో షో లు చేసి అలరించాడు ప్రదీప్ . కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ సెలబ్రిటీలను అభిమానులతో టచ్ లోకి తీసుకువచ్చి, వాళ్ళతో సందడి చేయించారు ప్రదీప్ మాచిరాజు.

అలాగే, ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ లో … ఆయన ఎనర్జీ తో అందరికి నవ్వులు పంచాడు. కాగా, గత కొన్ని రోజులుగా ప్రదీప్ ఎక్కడ కనిపించడంలేదు. గత కొన్ని రోజులుగా బుల్లితెరపై ఏ షో లో కూడా ప్రదీప్ కనిపించటం లేదు . అంతేకాకుండా ఉన్నట్లుండి ఆయన మూడేళ్లుగా చేస్తున్న ఢీ షో నుంచి కూడా తప్పకున్నాడు . దీంతో అభిమానులందరూ షాక్ గురయ్యారు . ఈ నేపథ్యంలో ప్రదీప్ పారితోషకం ఎక్కువగా డిమాండ్ చేయడం వల్ల ఢీ నుంచి తప్పించాలని వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఢీ షో నుంచి ప్రదీప్ తప్పుకోవడానికి గల కారణం రెమ్యూనరేషన్ వల్ల కాదని… వేరే కారణం ఉందని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

ప్రదీప్ కి బదులుగా డీ జోడి లోకి ఎంట్రీ ఇచ్చిన రవి స్వయంగా ఈ విషయం వెల్లడించాడు. ప్రదీప్ షో నుండి తప్పుకోవడానికి పారితోషకం కారణం కాదని, ప్రదీప్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని… అందువల్లే ఢీ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని రవి తెలిపారు. కాగా ఈ నెల 23న ప్రదీప్ పుట్టినరోజు సందర్భంగా మిగతా యాంకర్స్ అందరూ ప్రదీప్ ను కలవడానికి వెళ్లారట.

రవి క్లారిటీ ఇవ్వటం తో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్ని అబద్ధమని తేలింది. పారితోషికం వళ్లనో.. ఏదో కారణాలవల్ల ప్రదీప్ ప్రదీప్ ఢీ కి దూరం కాలేదు, అనారోగ్య సమస్యతో బాధపడుతుండటం వల్లే ఢీ కి దూరం అయ్యారని తెలుస్తోంది. అయితే ప్రదీప్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అనేది మాత్రం ఇంకా తెలియ రాలేదు . అంతే కాకుండా ఇంకొన్ని రోజుల్లో ప్రదీప్ కోలుకొని స్మాల్ స్క్రీన్ పై రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు అంటూ రవి చెప్పాడు.