గెలుపు ధీమా తో తెలుగు దేశం పార్టీ … Andhra Elections 2019

Andhra Elections 2019

Andhra Elections 2019

ఇంకా నెలరోజుల్లో ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ లో జరగబోతున్నాయి ఈసారి ఈ ఎన్నికలకి చాలా ప్రత్యేకత వుంది గెలుపు ధీమా తో అన్ని పార్టీలు మీడియాలో చాల బలంగా చెబుతున్నాయి. అసలు ఈసారి జరగబోవు ఎన్నికలలో ఎవరు గెలుస్తారనేది జవాబు దొరకని ప్రశ్నగానే ఉంది అక్కడవున్న పరిస్థితిని చూస్తుంటే. ఐతే అన్నిపార్టీలు తమ తమ బలాబలాలు చూపించే తరుణం ఆసన్నమయిందని చెప్పుకోవచ్చు అయితే అన్ని పార్టీలకు తమ బలం బలహీనత ఆ పార్టీలో ఉన్న నాయకులూ మరియు కార్యకర్తలే ఐతే పార్టీ నాయకులూ అంతకుమునుపు చేసిన తప్పులు మల్లి జరగకుండా ఒకింత జాగ్రత్తగానే ఉన్నారని చెప్పవచ్చు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను నాయకులను ఒక తాటిపై తెచ్చుకోవటంలో పార్టీలు నిమగ్నమై వున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకొనే పనిలో అందరు నిమగ్నమై ఉన్నారు . చేస్తున్న మరియు చెయ్యబోతున్న కార్యాచరణ ప్రణాళికలు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నారు.

Andhra Elections 2019

ఐతే టీడీపీ మాత్రం తామే మళ్ళి గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చంద్ర బాబు నాయుడు గారు చెబుతున్నారు విభజన తరువాత అందరు ఆంధ్ర వాళ్ళు అని హేళన చేసారని ఇక ఆంధ్ర వాళ్ళ పని అయిపోయింది అని అందరు ఎగతాళి చేసారాని ఐన అవన్నీ భరించి మేము మా ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చుతూ ఒక పక్క రాజధాని నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టి అందరి నోళ్లు మూయించాం అని చెప్పుకొచ్చారు. ఇక్కడి వారే వేరే రాష్ట్రాలకి అమ్ముడుపోయి తమ మీద చెడ్డగా ప్రచారం చేస్తున్నారు. 2014ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఏఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చకపోగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రేత్యేక హోదా గురించి మేము చేసిన పోరాటం ఇంకెవ్వరు చెయ్యలేదు సర్వ శక్తులు ఒడ్డి మరి మేము అది సాధిస్తాం అని చెప్పుకొచ్చారు. ఈసారి గెలుపు మాదే అని గట్టిగా చెబుతున్నారు.

ఐతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకొక ప్రత్యామ్నాయం కనబడటం లేదు ఎందుకంటే ఇప్పటివరకు చంద్ర బాబు నాయుడు చేసిన పనులు కానీ చేపడుతున్న ప్రాజెక్టులు కానీ చూస్తుంటే ఇంకొక ఐదు ఏళ్ళ పాలనా టీడీపీదే అని విశ్లేషకుల అంచనా. ఏది ఎలావున్నా ఈసారి ఎన్నికలు చాలా పోటాపోటీగా ఉండనున్నాయి.

See Also: TDP Announced MLA Candidates List

Andhra Elections 2019