ఆంధ్ర రాజకీయాల పై విశ్లేషణ ….

ప్రస్తుత రాజకీయాల ప్రకారం చుస్తే ఆంధ్ర ప్రదేశ్ లో రసవత్తర రాజకీయ పరిణామాలు మనకు కనబడుట అతిశోయక్తి కాదు. మరి ఎవ్వరు తదుపరి సిఎం అని చుస్తే ప్రస్తుతం వున్నా ఫాలోయింగ్ కానీ డెవలప్మెంట్స్ కానీ చుస్తే చంద్ర బాబు వైపే కనపడుతున్నాయి. విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి అందరికి తెలిసిందే ఆ గడ్డు సమయంలో చంద్రన్న తీసుకున్న నిర్ణయాలు కానీ చేసిన కృషి కానీ అమోఘం.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం రెండు రాజకీయ పార్టీలు పోటాపోటీ గా ఉన్నాయ్ మరి బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు వున్నా కానీ లేనట్టే. టీడీపీ మరియు వైసీపీ పార్టీలకి మద్య నెలకొన్న రాజకీయ ఉత్కంఠ చూస్తుంటే ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పటం చాల కష్టం. కానీ చంద్ర బాబు నాయుడు చేసిన డెవెలప్మెంట్స్ ని చూసి టీడీపీకి ఓటేస్తారా లేదా వైసీపీ చెప్పే వాగ్దానాలు చూసి వైసీపీ ఓటేస్తారా అని ప్రజల నిర్ణయం మీద ఆధారపడి వుంది.
ఇక చంద్ర బాబు విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి సీఎం గ ఉన్నప్పుడు హైదరాబాద్ ని డెవలప్ చేసిన తీరు అమోఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్ ఉన్నదంటే దాని చలవ చంద్ర బాబు గారిదే. బహుళ జాతి సంస్థలని ఆంధ్ర కి తీసుకురావటంలో కూడా ఒక మేర సక్సెస్ అయినట్టే.
రాజధాని నిర్మాణంలో కూడా అతను చేసిన కృషి అమోఘం. ఆంధ్ర లో అమలు అవుతున్న పథకాలు వాటి లబ్ది పొందుతున్న ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఇవ్వి అన్ని కలిపి టీడీపీ కె పగ్గాలు అప్పజెప్పే అవకాశం చాల ఎక్కువ.

ఇక జగన్ మోహన్ రెడ్డి విషయాన్ని వస్తే ఈసారి కాకపోతే మరి ఇక గెలుపు కష్టం. అతను ప్రజలకు ఇచ్చే హామీలు కనుక నమ్మి టీడీపీ కి వెతిరేకత వస్తే తప్ప వైసీపీ గెలుపు చాల కష్టం.

ఏది ఏమైనా ఆంధ్ర ప్రజలకి ఇది ఒక సువర్ణ అవకాశం తమ నాయకుడ్ని ఎన్నుకోవడానికి….