సినీ నిర్మాతలపై ఆంధ్రప్రదేశ్ సర్కారు వరాల జల్లు …!

Andhra Pradesh, Telugu Vilas

Andhra Pradesh Government Gives Offered To Film Producers —  సినీ నిర్మాతలపై ఆంధ్రప్రదేశ్ సర్కారు వరాల జల్లు …!

తెలుగు చిత్ర నిర్మాతలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. చిన్న నిర్మాతలకు శుభవార్తను చెబుతూ రూ. 4 కోట్ల బడ్జెట్ దాటకుండా నిర్మించే సినిమాలకు పూర్తిగా పన్ను రాయితీని కల్పిస్తామని వెల్లడించింది. సంప్రదాయ వాతావరణాన్ని కళ్లకుకట్టినట్టు చూపించే చిత్రాలకు రూ. 10 లక్షల ప్రత్యేక బహుమతిని అందిస్తామని పేర్కొంది. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి జీవో 116ను విడుదల చేసిన సర్కారు, రాష్ట్రంలో షూటింగ్ లను ప్రోత్సహిస్తామని తెలిపింది.

Andhra Film Industry, Telugu Vilas

Also Read: — నాన్న హోదాలో వచ్చిన బాబాయ్ కి పాదాభివందనం !: ఎన్టీఆర్

ఇదే విషయాన్ని వెల్లడించిన ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ, ఏపీలో సినిమా షూటింగ్ లకు ఎన్నో అనువైన ప్రదేశాలు ఉన్నాయని, నిర్మాతలు, దర్శకులు వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటికే పెద్ద సినిమాలకు అదనపు ఆటలు, టికెట్ పై అదనంగా వసూలు చేసుకునే సౌకర్యాన్ని కల్పించామని ఆయన గుర్తు చేశారు. పైరసీ కారణంగా నిర్మాతలు నష్టపోకుండా చూడాలన్నదే తమ అభిమతమని తెలిపారు.

                                 సినీ నిర్మాతలపై ఆంధ్రప్రదేశ్ సర్కారు వరాల జల్లు …!

                                     రాజమౌళి RRR లో ఎన్టీఆర్ పాత్ర అదేనట ….!