జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు…

వైసీపీ నేత జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్యాలస్‌లలో తప్ప మామూలుగా నివసించలేని జగన్‌కి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుంటుందని ప్రశ్నించారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అనుమానాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. రాజధాని ఎక్కడ అని వైసీపీ మేనిఫెస్టోలో పెడతారట అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతిలో ప్రస్తుతం 50వేల కోట్ల పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. 4 ఏళ్లుగా సొంత గడ్డ నుంచే పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడకు పోయినా జగన్ రాజప్రాసాదాల్లోనే బస చేస్తారన్న బాబు.. లోటస్‌పాండ్‌, బెంగళూరు, పులివెందుల్లో జగన్ ప్యాలస్‌లున్నాయన్నారు. వైసీపీ అంటే పేదల పార్టీ కాదు.. ప్యాలస్‌ల పార్టీ అన్నారు. విశాఖలో ప్రధాని మోదీ సభకు జనాల్ని తరలిస్తోంది వైసీపీయేనని ఆరోపించారు.