ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ లాంగ్ లీవ్‌..

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి బాప‌ట్ల హెచ్ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌కు బ‌దిలీపై వెళ్లాల్సి వ‌చ్చిన ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌రొక అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఉన్న ప‌లంగా నెల రోజుల‌పాటు లాంగ్ లీవ్‌పెట్టారు. ఈ రోజు ఉద‌య‌మే సీఎస్ బాధ్య‌త‌ల‌ను.. ఆ పోస్టుకు ఇన్‌చార్జిగా వ‌చ్చిన నీర‌బ్‌కు అప్ప‌గించిన ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం.. కొత్త స్థానంలో బాధ్య‌త‌లు తీసుకోకుండానే సెల‌వుపై వెళ్లిపోయారు.