బిగ్ బ్రేకింగ్: గల్లాతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..!

ఏపీ హైకోర్టు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు నోటీసులు జారీ చేసింది. గల్లా జయదేవ్‌ ఎన్నికను సవాల్ చేస్తూ, హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో భాగంగా, న్యాయస్థానం అతనికి నోటీజులు జారీ చేసింది. జయదేవ్‌తో పాటు ఎమ్మెల్యేలు రామానాయుడు, గద్దె రామ్మోహన్‌ రావులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. కాగా హైకోర్టులో వేర్వేరుగా దాఖలైన మూడు ఎన్నికల పిటిషన్లను గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మరో టీడీపీ నేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓట్లను సక్రమంగా లెక్కించకపోవడంతో, తాను ఓటమి పాలయ్యానన్నారు. ఇక రామానాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ.. వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ మూర్తి తరుపున వాసుదేవ రావు, గద్దె రామ్మెహన్ రావు ఎన్నికను సవాల్ చేస్తూ శ్రీనివాస రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు వారిని విచారణకు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.