ఏపీ సీఎం చంద్రబాబు ‘హిట్లర్’ లాంటివాడు

 

ChandraBabu

ఏపీ సీఎం టీడీపీ అధినేత హిట్లర్ లాంటివాడు అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చెక్కర్లు కొడుతుంది. అయిదేళ్లకు ఒకసారి కనిపించే మహానుభావుడు అని, నాలుగున్నర సంవత్సరాలు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా ఎన్నికల సమయానికి కావాల్సినన్ని హామీలు ఇచ్చి తప్పుకునేవారు అని, ఈ నాలుగు నెలలో ఇచ్చిన పై పై హామీలకు ప్రజలు ఈ నాలుగున్నర సంవత్సరాల మోసాన్ని మర్చిపోతారు అని ఓ నెటిజన్ వ్యాఖ్య చేశారు. అసలు హిట్లర్ అనడానికి కారణం ఏంటి, హిట్లర్ కు చంద్రబాబు కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా. ఉంది హిట్లర్ హయాంలో పార్లమెంటుకు వచ్చి ఒక కథను చూపించాడు అప్పటి ప్రజలకు…

పార్లమెంట్ లోకి హిట్లర్ వొస్తూ వొస్తూ ఒక కోడిని తన వెంట తీసుకొచ్చాడు. పార్లమెంట్ మొదలవగానే కోడికి ఉన్న ఒక్కో ఈకను పీకడం మొదలు పెట్టాడు. ఆ కోడి బాధతో విలవిలాడుతోంది. మొత్తం ఈకల్ని పీకేశాక   దానిని నేల మీద వదిలి జేబులో నుండి ధాన్యం గింజలను వేసాడట.. అంతే ఆ కోడి ఇకలను పీకాడు అనే సంగతి కూడా మర్చిపోయి ఆ గింజలను ఎంతో ప్రేమగా తిన్నదట .. అప్పుడు హిట్లర్
స్పీకర్ తో మాట్లాడుతూ ”ప్రజలు కూడా కోడిలాంటి వారే అని” అయిదు సంవత్సరాలు మనం వాళ్ళదగ్గర తీసుకున్నదంతా ఎన్నికల ముందు ఒక బిరియాని, మందు తీసుకొని ఓటేసి ప్రజలు తన భవిష్యత్తు తాకట్టు పెట్టుకుంటారు, అనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నాడు అని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తన ఫేసుబుక్ ఖాతాలో పోస్ట్ చేసాడు…