వైసీపీకి వలసలు టీడీపీకి షాక్‌ మీద షాక్

tdp,ysrcp

మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో వారి రాజకీయ భవిష్యత్తు బాగుండాలని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ కి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వలసలు పోతూనే ఉంటారు నేతలు. ఇది ప్రతి ఎన్నికల్లో జరిగేదే. అయితే ఈసారి మాత్రం ఒక పార్టీకి భారీ వలసలు పోతుంటే మరో పార్టీకి షాక్ మీద షాక్ పడుతుంది. ఆ పార్టీలు ఏవంటే వైసీపీకి వలసలు, టీడీపీకి షాక్ లు …

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరాడు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు వైసీపీ అధినేత వైస్ జగన్. ఇలాగే గతంలో కూడా హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైయస్‌ జగన్‌ సమక్షంలో గురజాల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. డాక్టర్‌ పొన్నం నాగ మల్లిఖార్జునరావు, టీడీపీ నేత వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారికి వైయస్‌ జగన్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తామని వారు తెలిపారు. రోజుకు ఒకరు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతూనే ఉన్నారు. మరి నెక్స్ట్ ఎవరు వస్తారో చూడాలి.