చిరులా పవన్ ఆ రెండు స్థానాల్లో పోటీ చేస్తారా… పోటీ అక్కడ నుండేనా ?

pawan kalyan,chiranjeevi

ఎన్నికలు సమీపిస్తున్నా ఏ మాత్రం క్లారిటీ లేని జనసేన పార్టీ ఏం చెయ్యబోతుంది. ప్రశ్నిస్తాం అంటూ వచ్చిన జనసేన పార్టీ మాత్రం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే కాకుండా వారు సైతం కన్ఫ్యూజన్లో పడ్డారు. జనసేన పార్టీ స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపికి మద్దతిచ్చి టిడిపి కోసం ప్రచారం చేసి ఇప్పుడు తర్వాత నిదానంగా టిడిపి నుండి జరిగి ప్రస్తుత టిడిపి పైన ఎదురుదాడికి దిగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇక రాబోయే ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పారు పవన్ కళ్యాణ్.. మొత్తం ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మిగతా స్థానాల మాట ఎలా ఉన్నా తాను పోటీ చేసే స్థానం ఏదో ఇప్పటివరకు ఒక్క క్లారిటీ కి రాలేకపోయారు. ఆ జిల్లాకు వెళ్తా, జిల్లా నుండి ఒక్కొక్క స్థలం నుండి పోటీ చేస్తానంటూ ప్రకటన చేసుకుంటూ పోతున్నారు. దీంతో అసలు జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అర్థంకాక పార్టీ శ్రేణులు తలపట్టుకుంటున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ సైతం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటన విషయం అటుంచి ముందు తాను ఎక్కడినుంచి పోటీ చేయాలి అన్న దానిపైన కసరత్తులు మొదలు పెట్టారని తెలుస్తోంది. అసలింతకీ జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అంటే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి పోటీ చేస్తారని మరొక ప్రచారం జరిగింది. మరోసారి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఆయన ఒక సభలో ప్రకటించారు. ఇలా ఏ జిల్లా కి వెళితే ఆ జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని తీసుకొని అక్కడి నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ చెబుతూ పోయారు. ఇక ఇంతకీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అంటే పార్టీ శ్రేణులు కూడా తలా ఒక పేరు చెప్పటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దాని పైన తెగ వర్కౌట్ చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా తాను పోటీ చేయడానికి మరొక స్థానం నుంచి కూడా అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అన్న బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా నడుస్తారు అని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 ఎన్నికల బరిలో పోటీలోకి దిగారు. ఆయన ఆ ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. అయితే తిరుపతి నుండి గెలుపొందిన ఆయన ఆ తర్వాత క్రమంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఇక ఆయన కేంద్రమంత్రి అయిపోయారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ను కూడా తిరుపతి నుండి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు కొందరు సూచిస్తున్నారు అని టాక్. అన్నయ్య ను ఆదరించిన తిరుపతి ప్రజలు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఆదరిస్తారని ఓ లాజిక్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉన్న కారణంగా అలాంటి ప్రయోగాలు చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని జనసేన పార్టీకి బాగా పట్టున్న శ్రీకాకుళం జిల్లా నుండి కానీ, తూర్పుగోదావరి జిల్లా నుండి కానీ పోటీ చేస్తే బాగుంటుందని మరికొందరు నేతలు చెబుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏమైనా పవన్ కళ్యాణ్ తాను ఎక్కడినుంచి పోటీ చేయాలి అన్న దానిపై చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన కన్ఫ్యూజన్ జనసేన పార్టీ పట్ల ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తుంది.
ఇక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడ్డారు. ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్నారు కాబట్టి అన్న చిరంజీవి తరహాలో రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ సైతం భావిస్తున్నారు. ఇక ఈ రెండు స్థానాలు ఏవి అనేది త్వరలోనే నిర్ణయించుకోనున్నారు పవన్ కళ్యాణ్. తిరుపతి విషయంలో కూడా సానుకూలంగానే ఉన్న పవన్ కళ్యాణ్ తిరుపతి, ఇచ్చాపురం, పిఠాపురం లలో ఏవైనా రెండు స్థానాల నుండి పోటీ చేస్తారని తెలుస్తోంది. గతంలో చిరంజీవికి విజయం అందించిన స్థానం కాబట్టి పవన్ కళ్యాణ్ తిరుపతి పై కాస్త మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారేమో చూడాలి