మంత్రి బొత్స‌పై అచ్చెన్నాయుడు ఫైర్‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మున్సిప‌ల్‌శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష ఉప నేత అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. కాగా, టీడీపీ హ‌యాంలో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఎటువంటి నిర్మాణం జ‌ర‌గ‌లేదంటూ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించిన నేప‌థ్యంలో నేడు టీడీపీ ముఖ్య నేత‌ల‌ బృందం నేడు అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించింది.

ఈ సంద‌ర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 12 ట‌వ‌ర్ల‌తో ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ నిర్మాణం చేస్తే ఇక్క‌డేమీ లేద‌న‌డానికి సిగ్గులేదా..? అంటూ మంత్రి బొత్స‌ను ప్ర‌శ్నించారు. మంత్రి కారు తెస్తే అమ‌రావ‌తిలో జ‌రిగిన అభివృద్ధి అంతా చూపిస్తాన‌ని అచ్చెన్నాయుడు స‌వాల్ విసిరారు. బొత్స త‌న స‌వాలును స్వీక‌రించాలి.. లేదా ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.