నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం…

Balakrishna New Movie

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్‌ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా వస్తున్న కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది వీరి హిట్ కాంబినేషన్ లో “జై సింహ” లాంటి సూపర్ హిట్ తరువాత వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై ప్రేక్షకులకు బారి అంచనాలే ఉన్నాయి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివి వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా బోయపాటి శ్రీను కెమెరా స్విచ్ ఆన్ చేసారు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి పరుచూరి మురళి కథను అందిస్తున్నారు ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ జులై నుంచి ప్రారంభం కానుంది , చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా రామ్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు మరియు త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ ప్రకటించింది

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి
స‌మ‌ర్ప‌ణ: సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
బ్యాన‌ర్‌: హ్యాపీ మూవీస్‌
ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.రవికుమార్‌
క‌థ‌: ప‌రుచూరి ముర‌ళి
సంగీతం: చిరంత‌న్ భ‌ట్
సినిమాటోగ్ర‌ఫీ: సి.రామ్‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌: చిన్నా
డైలాగ్స్‌: ర‌త్నం
ఫైట్స్‌: రామ్‌లక్ష్మ‌ణ్‌
నిర్మాత‌: సి.క‌ల్యాణ్‌
కో ప్రొడ్యూస‌ర్‌: సి.వి.రావ్‌

Balakrishna New Movie