ఈ జన్మకి చాలు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

 

srinivasఅల్లుడు శీను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’, ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ‘కవచం’లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించారు సాయిశ్రీనివాస్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేశారు. కార్యక్రమంలో దర్శకులు వి.వి.వినాయక్‌, అజయ్‌ భూపతి, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, అభిషేక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ నామ, బెక్కెం వేణుగోపాల్‌, అనీల్‌ సుంకర, బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ.. ‘సాయికి హ్యాపీ బర్త్‌డే. తనతో ‘అల్లుడు శీను’ సినిమా చేస్తున్న సమయంలో కొత్త హీరోతో చేసిన ఫీలింగ్‌ ఎప్పుడూ కలగలేదు. అనుభవమున్న‌ హీరోలా అనిపించాడు. అలాగే బోయపాటితో చేసిన సినిమాతో స్టార్‌ అయ్యాడు. ఆర్టిస్ట్‌గా ప్రతి సినిమాకు ఎదుగుతున్నాడు. ‘అల్లుడు శీను’ సినిమాను, పాటలను నేను మరచిపోలేను. ఎందుకంటే ఆ సినిమాను అంత గ్రాండ్‌గా తెరకెక్కించాం. సాయి ఇంకా పెద్ద స్టార్‌గా ఎదగాలి. ఎవరికైనా ఒకట్రెండు ఫెయిల్యూర్స్‌ సహజమే. హీరోగా సాయి ఎప్పుడూ ఫెయిల్‌ కాడు.. అవ్వడు కూడా.’ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘సాయి మా ఫ్యామిలీ మెంబర్‌. సినిమా, సినిమాకు తను డాన్స్‌, ఫైట్స్‌ పరంగానే కాదు.. నటన పరంగా ఎదుగుతూ వస్తున్నాడు. మంచి కథలను ఎంచుకుని సినిమాలు చేసి తను మరింతగా ఎదగాలి. ఆల్‌ ది బెస్ట్‌ టు సాయి’ అన్నారు. అజయ్‌ భూపతి మాట్లాడుతూ.. ‘ఇప్పుడు స్టార్స్‌ ఉన్నా కూడా ఇండస్ట్రీకి స్టార్స్‌ అవసరం ఎంతైనా ఉంది