సీఎం జ‌గ‌న్‌పై న‌మ్మ‌కంతోనే.. : బీజేపీ నేత విష్ణ‌కుమార్‌రాజు

విశాఖ భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కాసేప‌టి క్రితం బీజేపీ నేత విష్ణు కుమార్‌రాజు ఫిర్యాదు చేశారు. మాధ‌వ‌దారిలో ఒక వ్య‌క్తి ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేసిన‌ట్టు 2015లో ఎమ్మెల్యేగా ఉన్న తాను అప్ప‌టి ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ని విష్ణుకుమార్‌రాజు అన్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్న న‌మ్మ‌కంతో మ‌రోసారి తాను సిట్ అధికారుల‌కు ఫిర్యాదు చేస్తున్న‌ట్టు చెప్పారాయ‌న‌.

విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ మాధ‌వ‌దారిలో స‌ర్వే నెం.13/3లో రెండు ఎక‌రాల ఎనిమిది సెంట్లు ప్ర‌భుత్వ భూమి క‌బ్జాకు గురైంది. చ‌నుప‌ల్లి సీతారామ్ అనే వ్య‌క్తి ఆ భూమిని క‌బ్జాచేసి ఆఖ‌ర‌కు ల్యాండ్ కూడా అమ్మేస్తున్నాడు. ఇది జ‌రుగుతుంద‌న్న విష‌యం నేను 2015లోనే జాయింట్ క‌లెక్ట‌ర్‌కు అన్ని ఆధారాల‌తో స‌హా ఇచ్చాను.

కానీ, అధికారులు చ‌ర్య‌లేమీ తీసుకోలేదు. త‌రువాత 2017లో సిట్‌లో కూడా ఫిర్యాదు చేశాను. అయినా ఫ‌లితం లేదు. క‌బ్జాదారుడిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటంటే..? ఆయ‌న‌కు పొలిటిక‌ల్ నాయ‌కుల బ్లెస్సింగ్ పుష్క‌లంగా ఉండ‌ట‌మే. దేవుడి బ్ల‌స్సింగ్ ఉంటే మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో.. లేదో తెలీదు కానీ.. పొలిటిక‌ల్ లీడ‌ర్స్ బ్లెస్సింగ్ ఉంటే మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఆ క‌బ్జాదారుడ్ని చూస్తే తెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు.