‘బీజేపీ’కి షాక్ ‘జనసేన’లోకి ఆ ఎమ్మెల్యే

 

janasena

ఇటు బీజేపీ, అటు జనసేనల లో ఉన్న భార్యభర్తలు ఒకే చోట ఉండబోతున్నారు. ఇప్పటికే జనసేనలో ఆకుల సత్యనారాయణ భార్య చేరిన విషయం అందరికి తెలిసిందే. భార్య జనసేనలో చేరినప్పటినుంచి సత్యనారాయణ కూడా జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఈరోజు సత్యనారాయణ కూడా జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించేశారు.

ఈ నెల 21వ తేదీన జనసేనలో చేరుతున్నట్టు ఆకుల సత్యనారాయణ ఈరోజు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయాలని ఆదేశిస్తే తాను అక్కడి నుండి పోటీ చేస్తానని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా రాజమండ్రి అర్బన్ స్థానం నుండి ఆకుల సత్యనారాయణ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. మరి ఇప్పుడు అతను, అతని భార్య ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.