నటుడు మహేష్ ఆనంద్ మృతి….దాని వెనుక అనేక అనుమానాలు.

actor-mahesh-anand-passed-away

హిందీ చిత్ర సీమలో 1990 వ దశకంలో విలన్ పాత్రలతో నటించి మెప్పించిన, నటుడు మహేష్ ఆనంద్ మృతిచెందారు. షెహన్ షా, స్వర్గ్, కురుక్షేత్ర, విజేత లాంటి ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన మహేష్ ఆనంద్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.హిందీ లోనే కాకుండా తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి డైరక్ట్ చేసిన నంబర్ వన్ సినిమా మహేష్ ఆనంద్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో మహేష్ ఆనంద్-బ్రహ్మానందం కామెడీ బాగా క్లిక్ అయింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా బాలు చిత్రంలో కూడా మంచి పాత్ర చేసిన మెప్పించిన మహేష్ ఆనంద్ మరణించడం విచారకరం. పోలీసులు ఆయన భౌతికకాయాన్ని కుళ్లిపోయిన స్థితిలో కనుగొన్నారు. పోస్టుమార్టం జరిగితే తప్ప అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఆయన మృతి వెనుక గల కారణాలు పరిశీలిస్తే గత 12 ఏళ్లకు పైగా సినిమా అవకాశాల్లేక చాలా ఇబ్బందులు పడుతున్న మహేష్, సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత పూర్తిగా మద్యానికి బానిసయ్యారట. ఇదే సమయంలో అతడి భార్య కూడా మహేష్ ఆనంద్ కు దూరంగా రష్యాలో ఉంటున్నారట. సినిమాల్లేక, కుటుంబ పరంగా కూడా ఒంటరి అయిపోవడంతో మహేష్ తీవ్ర నిరాశలో కుంగిపోయారని ఇరుగుపొరుగు వాళ్లు చెబుతున్నారు.మహేష్ ఆనంద్ మద్యానికి బానిసయ్యాడనే అంటున్నారు ఆయనకు తెలిసినవాళ్లు. ముంబయి పోలీసులు కూడా ప్రాధమికంగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అతిగా మద్యం సేవించిన మహేష్ ఆనంద్, గుండెపోటుతో మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మహేష్ చనిపోయిన టైమ్ లో అతడితో పాటు ఎవరున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు అక్కడి పోలీసులు.ఏది ఏమైనా కూడా ఒక స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఈ విధంగా అవకాశాలు లేక అకాలంగా మరణించడం ఎంతో గమనార్హం.