దీపావళి కానుకగా బన్నీ సినిమా ..!

Bunny Movie , Telugu Vilas

దీపావళి కానుకగా బన్నీ సినిమా ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా సూర్య నా ఇల్లు ఇండియా బాగా నిరాశ పరచడంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద బాగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఎన్నో కధలు విన్నప్పటికి ఏది ఓకే చేయలేదు. పందెం కోడి ఫేమ్ లింగుసామి తో సినిమా చేయాల్సివుంది కానీ దానిని పట్టాలెక్కించలేదు , ఆ తర్వాత విక్రమ్ కె కుమార్ తో చేయనున్నాడని వార్తలు గట్టిగ వినిపించాయి. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. నా పేరు సూర్య రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తున్నా అల్లుఅర్జున్ సినిమా పట్టాలెక్క లేదు.ఈ మధ్య త్రివిక్రమ్ తో కలిసి ఒక హిందీ రీమేక్ లో నటించనున్నాడని పుకార్లు వినిపించాయి.

రీమేక్ లో ఎంత నిజం ఉందో తెలీదుగాని అల్లు అర్జున్ మాత్రం తనకు జులాయి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ తో సినిమా చేయాలి అని పట్టుపట్టాడంట. త్రివిక్రమ్ కూడా అరవింద సామెత వీరరాఘవ తో సెన్సషనల్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ మాటల మాంత్రికుడు బన్నీ కోసం రంగంలోకి దిగనున్నాడట. ఈ కంబో లో సినిమా ని దీపావళి రోజున ప్రకటిస్తారంట.

Related Posts:– 

బోయపాటి మార్క్ మాసివ్ లుక్ …!

నిర్మాతగా రాజమౌళి తనయుడు

హాల్ చల్ చేస్తున్న ఇలియానా ..!

‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవంలో ప్రభాస్ ?

అరవింద సమేత చిత్రంతో సెంచరీ.. దూసుకుపోతున్నాడుగా!