హీరో నాగ్,వై.ఎస్ జగన్ భేటీ పై చంద్ర బాబు ఫైర్.

ఏపీలో వైసీపీ కి రోజురోజుకీ పెరిగిపోతోన్న సినీ మద్దతు… ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ యాత్రలో కొందరు సినీతారలు, ఆయన వెంట అడుగులు వేశారు. తాజాగా.. లోటస్ పాండ్ లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ.. కొందరు తారలు ఆయన్ని కలుస్తున్నారు. వచ్చేవి ఎన్నికలు రోజులు కావడంతో ఈ భేటీలు ఆసక్తికరంగా మారాయి.నటుడు అక్కినేని కుటుంబానికి మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సత్సంబంధాలే ఉన్నాయి. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో వీరికి రాకపోకలు ఉండేవి. తాజాగా.. ఈ అనుబంధాన్ని జగన్ కూడా కొనసాగిస్తున్నారు. మంగళవారం నాగార్జున జగన్ నివాసానికి వెళ్లి మరీ కలిశారు. వీరి కలయిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ భేటీ పై పలు ఆసక్తి కరమైన ఆరోపణలు చేసారు ఏపీ సీఎం. వైఎస్ జగన్ ఇంటికి నిన్న హీరో నాగార్జున వెళ్లడం జరిగింది.

వారిద్దరూ గంటపాటు భేటీ అవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. ఈ ఉదయం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న వేళ, ఓ నేత నాగార్జున, జగన్ ల భేటీ గురించి ప్రస్తావించిన వేళ, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరస్థులతో సినీ నటులు భేటీ కావడం దురదృష్టకరమన్న ఆయన, ఇటువంటి భేటీలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎంతో అండగా నిలబడుతోందని, అభివృద్ధికి అండగా అందరూ నిలవాల్సిన సమయంలో పరిశ్రమ ప్రముఖులు నేరగాళ్లతో కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో మరి.