ఓటమిని నుంచి కోలుకోక ముందే చంద్రబాబు ఇంట్లో విషాదం

Chandrababu had tragedy in the house before recovering ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్నికల అనంతరం అమరావతి చేసుకున్నారు. మహాకూటమి పేరుతో చంద్రబాబు , కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. తెరాస వేగం ముందు మహాకూటమి నిలబడలేక పోయింది , దారుణ పరాజయం పాలైంది. ఇక ఓటమి నుంచి కోలుకోక ముందే చంద్రబాబు ఇంట దారుణమైన విషాదం నెలకొంది. చంద్రబాబు రెండవ సోదరి కుమారుడు అంటే స్వయానా… చంద్రబాబు మేనల్లుడు ఉదయ్ కుమార్ ఈ రోజు ఉదయం మరణించారు. ఆయన వయసు కేవలం 43 సంవత్సరాలు మాత్రమే. ఉదయ్ కుమార్ కు హఠాత్తుగా గుండెపోటు రావటంతో ఆయాన్ని కేర్ హాస్పిటల్ కి తరలించారు. కానీ పరిస్థితి విషమంగా మారడంతో ఆయన కళ్ళుముసినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ విషయాన్నీ తెలుసుకున్న చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ రానున్నారు.