వైసీపీ ప్రభుత్వానికి ఆ సత్తా లేదు….. చంద్రబాబు వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని పై మళ్లీ చర్చలేపారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కాగా అమరావతినే రాజధానికి సరైనదని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా జగన్‌ కూడా స్వాగతించారన్నారు.

శివరామకృష్ణన్‌ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అమరావతినే అనుకూల ప్రాంతంగా ధృవీకరించిందన్నారు. ఇక ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన నాలుగేళ్ల తరువాత మళ్లీ రాజధాని నిర్ణయంపై కమిటీ వేయడం ఏంటి..? హైకోర్టు వద్ద తాగడానికి టీ కూడా లేని పరిస్థితి అనే వ్యాఖ్యలు మీకు తలవంపులుగా లేవా..? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వానికి రాజధాని నిర్మించే సత్తా లేదు. ప్రజల ముందు ఆ విషయాన్ని ఒప్పుకునే నిజాయితీ లేదు. అందుకే రాజధానిపై అటూ ఇటూ చర్చలు లేపుతున్నారని ఘాటుగా ట్వీట్ చేశారు చంద్రబాబు.