చంద్రబాబు కొత్త ప్లాన్ మోడీకి “వైట్ పేపర్ల”తో స్వాగతం

chandrababu,narendramodi

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు తొందర్లోనే జరగనున్నాయి , వాటికోసం ఎప్పటి నుండే అందరు వ్యూహాలు , ఎన్నికలు ప్రచారాల గురుంచి సిద్ధంగా ఉన్నారు , ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు . చంద్రబాబు మోడీని విభిన్నంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. మోడీ ఏపీకి రాక ముందే నాలుగున్నరేళ్లలో ఆయన చూపించిన వివక్ష ప్రజల ముందు ఉంచడానికి సిద్ధమయ్యారు. పనిలో పనిగా తాను చేసిన అభివృద్ధినికూడా హైలెట్ చేయబోతున్నారు. అందు కోసం చంద్రబాబు ఎంచుకున్న వ్యూహం “శ్వేతపత్రాలు”. 2014లో అధికారంలోకి వచ్చిన నాడు రాష్ట్రం ఉన్న పరిస్థితి పై ఆనాడు శ్వేత పత్రాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి తాజాగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, తీసుకువచ్చిన ప్రాజెక్టులపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించారు.

శ్వేతపత్రం అంటే ఆయా రంగాల్లో ఉన్న ఏ టూ జడ్ వివరాలు ప్రకటించడం. గతంలో ఎలా ఉంది ఇప్పుడెలాఉందో వివరించడం. నాలుగున్నరేళ్ల కాలంలో.. కేంద్రం రాష్ట్రానికి ఏమివ్వాలి ? ఏమిచ్చింది అనే అంశాన్ని అందులో చెప్పబోతున్నారు . కేంద్రం నుంచి సాధారణంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయకపోవడం వంటి అంశాలపై ప్రజల ముందు వాస్తవాలను “వైట్ పేపర్ల” ద్వారా ఉంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రెవిన్యూ లోటు నుంచి పోలవరం వరకూ ఏ విషయంలోనూకేంద్రం సాయంపై ప్రభుత్వం సంతృప్తిగా లేదు. జాతీయప్రాజెక్టుగా కనిపించినప్పటికీ నేటికీ నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు బకాయిల రూపంలో ఉన్నాయి. ఇవన్నీ శ్వేత పత్రంలో ప్రకటించి మోడీ రాకముందే ఈ పత్రాన్ని విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు .మోడీ జనవరి 6వ తేదీన రాష్ట్రానికి రాబోతున్నారు. జనవరి మొదటి వారంలో చంద్రబాబు శ్వేత పత్రాల విడుదలను ప్రారంభించనున్నారు. వీటి ద్వారా ఎన్నికలకు ముందే ఎవరేమిటో.. తేలిపోతుందని టీడీపీ నేతలు అంటున్నారు. మరి ఈ ప్లాన్ చంద్రబాబు కి ప్లస్ అవుతుందో లేదో చూడాలి .