గవర్నర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు …!

chandrababu, Telugu Vilas

గవర్నర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు …!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలే హైలెట్ గా నిలిచాయి. అసలు నా ప్రభుత్వంలో నా అధికారికి ఫోన్ చేసి నివేదిక అడగడానికి గవర్నర్ కి ఏం సంబంధం అంటూ మండిపడ్డారు. అలాగే గవర్నర్ అధికారాల గురించి మాట్లాడుతూ… తాను 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని తనకు గవర్నర్ అధికారాలపై అవగాహన ఉందని స్పష్టంగా చెప్పిన ఆయన కేంద్ర౦ ఆడిస్తున్న డ్రామా ఇదన్నారు.

Jagan-attack Image,Jagan Images

ఇక జగన్ వ్యవహార శైలి విషయంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు చంద్రబాబు. దాడి జరిగింది విశాఖలో అయితే ఆయన విమానం ఎందుకు ఎక్కి వెళ్లిపోయారని.. విమానాశ్రయ పోలీసులు ఎందుకు స్పందించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. అంతా బాగానే ఉంది అనుకున్న తరుణంలో జగన్ కి ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ తో ఆయన వెళ్లి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని వ్యాఖ్యానించారు. ఇవన్ని ఎవరికి అయినా అర్ధమవుతాయని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఇలాంటి ఆటలు తన ప్రభుత్వంలో సాగవు అన్నారు.

                        గవర్నర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు …!

Related Posts: — 

టీడీపీని టీఆర్ఎస్ టార్గెట్ చెయ్యటానికి కారణం అదే

జగన్ పై దాడి అనంతరం ట్వీటర్ లో స్పందించిన నారా లోకేష్ …!

జగన్ పై దాడి చేసిన యువకుడి పేరు… వివరాలు ఇదిగో…

జగన్ ను పొడిచిన కత్తికి విషం పూసి ఉంటే ఏంటి పరిస్థితి?: రోజా ఆందోళన