బ్రేకింగ్ న్యూస్: వల్లభనేనికి కీలక పదవి ఆఫర్ చేసిన సీఎం జగన్..?

తాజాగా నిన్న వల్లభనేని వంశీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో సమావేశమైన అనంతరం, ఏపీ సీఎం జగన్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. అయితే వంశీ వైసీపీలో చేరేందుకు జగన్‌తో చర్చించారని, అందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వైసీపీలో చేరాలంటే వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అయితే దానికి వల్లభనేని వంశీ కూడా ఓకే చెప్పడంతో జగన్ ఆయనకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారట. అయితే వల్లభనేని రాజీనామా చేస్తే గన్నవరంలో ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఉప ఎన్నిక సీటును వంశీకీ కాదని ఆయన చేతుల్లో మొన్న ఓడిపోయిన యార్లగడ్డకు ఇచ్చేందుకు జగన్ రెడీ అయ్యారని, వంశీనీ రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నారని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఏది ఏమైనా వల్లభనేని మాత్రం త్వరలోనే వైసీపీ పంచన చేరుబోతున్నారని తేలిపోయింది.