విశాఖపై కేబినెట్ మీటింగ్ లో జగన్ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ ……

జీఎన్ రావు కమిటీపై కేబినెట్ మీటింగ్ జరిగినా రాజధాని అంశంపై ఇంకా స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రాలేదు. అయితే.. ఈ కేబినెట్ మీటింగ్ లో జగన్ విశాఖపై కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నివేల కోట్లు ఖర్చుచేసినా , అమరావతిని అబివృద్ది చేయలేమని ఆయన అన్నారట. ఇక్కడ ఖర్చు చేసే ఖర్చులో పది శాతం ఖర్చుతో విశాఖను మరో హైదరాబాద్ మాదిరి అబివృద్ది చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారట. అయితే విశాఖను రాజధాని గా ప్రకటించడానికి తొందరేమి లేదని ఆయన అన్నట్టు తెలిసింది.

అన్ని విషయాలు ప్రజలకు తెలియచెప్పిన తర్వాత నిర్ణయం చేద్దామని ఆయన అన్నారని సమాచారం. కాగా కొందరు మంత్రులు తొందరగా ఈ అంశం తేల్చేద్దామని అంటే, మరికొందరు వచ్చే నెల మూడున బోస్టన్ గ్రూప్ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటించిడం మంచిదని సూచించారు. ఇప్పుడు విశాఖపై జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విశాఖ కాబోయే రాజధాని అని ఆయన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదన్నది ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది.

అయితే.. విశాఖను రాజధానిగా ప్రకటించడమే తరువాయి అని అంతా అనుకున్నసయమంలో అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోకుండానే… కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఏపీ భవిష్యత్ ఏమవుతుంది. ఏపీ రాజధాని విషయంలో కేబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుందా అని ప్రజలంతా ఎదురు చూశారు. అమరావతి రాజధానిగా ఉంటుందా.. ఉండదా.. విశాఖ రాజధాని అవుతుందా.. హైకోర్టు సంగతి ఏంటి.. హైకోర్టు బెంచులు ఎక్కడ ఎక్కడ ఉంటాయి. ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అంశంపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. రాజధాని అంశంపై నిర్ణయం కోసం జగన్ మరో కమిటీ వేశారు.

హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాన్ని మంత్రిమండలి నిర్ణయించింది. మరి ఎందుకు ఇంకా జగన్ నాన్చుతున్నారు .. ఇందుకు అనేక వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంత రైతుల సమస్యను సావధానంగా పరిష్కరించి..వారిని శాంతింపజేసిన తర్వాత విశాఖను రాజధానిగా ప్రకటిస్తే బావుంటుందన్న ఆలోచన కారణంగానే జగన్ ఇలా చేసినట్టు తెలుస్తోంది.

ప్రజలు ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తారా అంటూ కొన్ని మీడియా చానెల్స్ కధనాలు ప్రచురించారు . ఇంకా మనం చూస్తున్నట్లు అయితే అమరావతి ప్రజలు ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు . మిగతా ప్రజలలో అయితే భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి . మొత్తానికి జగన్ తీసుకున్న రాజధాని నిర్ణయం సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే వుంది . ఇప్పుడు అమరావతి నే రాజధానిగా వుంటుందా ? లేదా ఏపీ కి మూడు రాజధానులు అన్న జగన్ నిర్ణయం నిజము అవుతుందో వేచి చూడవలసిందే ?