పవన్ పిలిస్తే “జనసేన” లోకి వస్తా …. “ఆలీ స్టేట్ మెంట్ “

ali,pawan kalyan

తెలుగు చిత్ర సీమలో తనదైన హాస్య నటనతో ఎంతో పేరు,గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆలీ. ఈయనకు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క స్టార్ హీరోతోనూ మంచి అనుబంధాలు ఉన్నాయి.అందరికి కావలిసిన వ్యక్తి గా పరిశ్రమలో మంచి పేరు ఉంది.మొదటి నుంచి ఆలీ రాజకీయాలకు సంబంధాలు లేకుండా ప్రజాసేవ, సామాజిక సేవ చేయడంలో ఇప్పటికే అనేక ఛారిటీస్ నడిపిస్తున్నాడు.ఇలా చూసుకుంటూ పరిశ్రమలో అత్యంత ఆప్తుడు గా పవన్ కల్యాణ్ కి , నటుడు ఆలీకి మధ్య ఉన్న రిలేషన్ తెలిసిందే. తన అన్ని చిత్రాల్లో ఆలీని పక్కన పెట్టుకుని కామెడీ చేయడం పవన్ కు ఎంతో ఇష్టం. ఇక, ఆలీ రాజకీయాల్లోకి వచ్చి, ప్రజా సేవ చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత, అన్ని రాజకీయ పార్టీల అధినేతలనూ కలిశారన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, చంద్రబాబు, జగన్ తదితరులతో ఆలీ భేటీ అయ్యారు. తాజాగా, తన రాజకీయ రంగ ప్రవేశంపై ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.

తాను జనసేన పార్టీలో చేరబోవడం లేదని, ఏ పార్టీలో చేరుతానో అతి త్వరలో చెబుతానని అన్నారు. సినిమా వేరు, స్నేహం వేరు, పార్టీ వేరు అని వ్యాఖ్యానించిన ఆలీ, తనను ఎన్నడూ పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరాలని కోరలేదని స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం అభిమానినన్న విషయం పవన్ కు తెలుసునని చెప్పారు. పవన్ కోరితే జనసేన పార్టీకి ప్రచారం చేసేందుకు సిద్ధమని అన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని భావించానని, ఆ మేరకు కోరుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు.ఒక వేళ పవన్ గనక కోరితే ఆ పార్టీలో చేరతారా అంటే మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అంటున్నారు.చూడాలి ఏం అవుతుందో..