డిజిటల్ ప్రచారం లో కాంగ్రెస్… టీఆర్ఎస్ కు స్పూఫ్ లతో పంచ్

Congress Bjp, Telugu Vilas

డిజిటల్ ప్రచారం లో కాంగ్రెస్… టీఆర్ఎస్ కు స్పూఫ్ లతో పంచ్

తెలంగాణా లో ముందస్తు ఎన్నికలకు తహతహలాడిన టీఆర్ఎస్ అసెంబ్లీ రద్దు చేసి జంబో లిస్ట్ ప్రకటించి ప్రచారంలో కూడా ఫుల్ దూకుడు చూపిస్తుంటే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల జాబితా ప్రకటించని కారణంగా గులాబీ దండుకు చెక్ పెట్టటానికి సోషల్ మీడియా ను వాడేస్తుంది. మొన్నా మధ్య కాంగ్రెస్ నాయకులను దండు పాళ్యమ్ బ్యాచ్ అని ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తే రివర్స్ కౌంటర్ గా కేసీఆర్ అండ్ బ్యాచ్ ఫొటోస్ మార్ఫ్ చేసి పెడితే ఫుల్ వైరల్ అయ్యింది.
ఇప్పుడు ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పటానికి అందివ‌చ్చిన అవ‌కాశ‌న్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్న దిశ‌గా అడుగులు వేయ‌డం మొద‌లుపెట్టిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో మైలేజ్ కోసం ప్రయత్నిస్తుంది. టీడీపీ,టీజేఎస్,పీఐని జ‌ట్టుగా చేర్చుకుని మ‌హాకూట‌మి పొత్తుల చిక్కుల‌తో ఓ ప‌క్క స‌త‌మ‌త‌మ‌వుతూనే రాజ‌కీయ చ‌తుర‌త‌తో టీఆర్ఎస్ ను తిప్పలు పెట్టే పనిలో వుంది.

indian congress logo
ఇందులో భాగంగా వేదికల మీదనే కాదు ఎక్కడ వీలైతే అక్కడ టీఆర్ఎస్ ను ప‌తాక స్థాయిలో విమ‌ర్శిస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు సోష‌ల్ మీడియాను కూడా బాగానే వాడేస్తున్నారు. అదీ కాకుండా సినీ క్లిప్పింగుల‌ను సైతం జోడించి పేర‌డీ వీడియోలను క్రియేట్ చేస్తూ ఓట‌ర్ల‌ని ఆక‌ట్టుకునే ప‌నిలోప‌డ్డారు. ఇటీవ‌ల అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించిన సింగం చిత్రాన్ని మార్ఫింగ్ చేసి స్ఫూఫ్‌గా టీఆర్ఎస్ వాడితే దానికి కౌంట‌ర్ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్ పెట్టి హల్ చల్ చేస్తుంది.. క‌ల్యాణ్‌రామ్ న‌టించిన ప‌టాస్‌ చిత్రంలోని ఓ వీడియోను కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్ఫింగ్ చేయిచిన తీరు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో న‌వ్వుల పువ్వులు పూయిస్తోంది.

trs-Party,kcr

ఈ వీడియోలో క‌ల్యాణ్‌రామ్‌గా ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిని చూపిస్తే విల‌న్ బ్యాచ్‌గా కేసీఆర్, కేటీఆర్‌తో పాటు హ‌రీష్‌రావును కూడా బాగానే వాడేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్ గా మారిపోయింది . ఎన్నిక‌ల వేళ డిజిటల్ ప్రచారం లో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఒక అడుగు ముందుంది .

Related Posts: — 

ఆ ఒక్క సీటే కూటమిలో కామ్రేడ్ల మొండివైఖరికి కారణం.. కాంగ్రెస్ ఏం చేస్తుందో

సీఎం ఎవరో అప్పుడు చెప్తానన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్

కాంగ్రెస్ కు కొత్త చిక్కు …టీడీపీ పై రాములమ్మ అనుమానాలు

కాంగ్రెస్ కు కొత్త చిక్కు …టీడీపీ పై రాములమ్మ అనుమానాలు