భారత సైనికుల వ‌ల్లే త‌న కొడుకు ఉగ్ర‌వాదిగా మారాడు …ఆదిల్‌ తండ్రి

పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై ఆదిల్ అహ్మద్‌ ఆత్మాహుతి దాడి చేసి 43 మంది ప్రాణాల‌ను బ‌లితీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆదిల్ త‌ల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.ఆదిల్ ఇంత దారుణానికి పాల్పడడం వెనుక ఒక బలమైన కారణం ఉందని.భారత సైనికుల వ‌ల్లే త‌న కొడుకు ఉగ్ర‌వాదిగా మారాడ‌ని, వారు గ‌తంలో చేసిన అవ‌మానం త‌ట్టుకోలేకె , వారిపై క‌క్ష పెంచుకున్నాడ‌ని సూసైడ్ బాంబర్‌ ఆదిల్‌ అహ్మద్‌ దార్, తండ్రి గులామ్‌ హసన్‌ దర్ తెలిపారు. .

గతంలో జరిగిన ఒక సంఘటనే ఇందుకు ప్రధాన కారణం.’మూడేళ్ల క్రితం స్కూల్ నుంచి వ‌స్తున్న ఆదిల్‌ను భార‌త సైనికులు అడ్డుకుని తీవ్రంగా కొట్టారు. ముక్కు నేల‌కు రాయించి జీపు చుట్టూ తిప్పించారు. అదిల్ దీన్ని తీవ్ర అవ‌మానంగా భావించాడు. కార‌ణం లేకుండా ఎందుకు కొట్టారని ఎప్పుడు అడిగేవాడు. ఎప్పుడూ దీని గురించే ఆలోచించేవాడు. వారిపై కోపం పెంచుకుని ఉగ్ర‌వాద సంస్థ‌లో చేరాడు. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉండాల‌ని మేం చాలా సార్లు చెప్పాం. అయినా మా మాట విన‌లేదు. ఈ సందర్భంలోనే గ‌తేడాది మార్చి నుంచి ఆదిల్ మాకు దూర‌మ‌య్యాడు. ఆదిల్ ఇంత దారుణానికి ఒడిగ‌డ‌తాడ‌ని మేం అనుకోలేదు”. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర జ‌వాన్ల కుటుంబాలు అనుభ‌విస్తున్న బాధే మాకూ ఉంద‌ని
ఆదిల్ అహ్మద్‌ తండ్రి తెలిపారు.