స్టార్ట్ అయిన ఎన్నికల జోరు … ‘డ్యాన్సింగ్ అంకుల్‌’ పై దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం..

Dancing Aunkul , Telugu Vilas

స్టార్ట్ అయిన ఎన్నికల జోరు … ‘డ్యాన్సింగ్ అంకుల్‌’ పై దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం..

డ్యాన్సింగ్ అంకుల్‌ గా దేశవ్యాప్తంగా అందరికి పరిచయం అయిన సంజీవ్ శ్రీవాస్తవ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భోపాల్‌లోని బాబా ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తన వృత్తితో కంటే డ్యాన్స్‌తోనే ఎక్కువ పేరు సంపాదించారు. ఆయన తన బావమరిది పెళ్లిలో చేసిన డ్యాన్స్ ఆయనకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి . ఆ డ్యాన్స్ వీడియోతో ఆయన పేరు మార్మోగింది. ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు.

Image result for dancing ankul

సంజీవ్ శ్రీవాస్తవపై ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారులు దృష్టిసారించారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆయనను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా శ్రీవాస్తవతో కలిసి ఓ ప్రచార వీడియోను రూపొందించారు. ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఆ వీడియో ద్వారా ఆయన ఓటర్లకు పిలుపునిస్తున్నారు. విషయం తెలిసిన విదిశా జిల్లా అధికారులు కూడా ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. అయితే మన నాయకుల కన్ను కూడా ఇలాంటి వీడియోస్ పై పడింది, చూడాలి మరి మనం కూడా డ్యాన్సింగ్ అంకుల్‌ ని చూస్తామో లేదో..

Related Posts: — 

జగన్మోహన్ రెడ్డి కాదు… జగన్ మోదీ రెడ్డి : నారా లోకేష్ …!

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జగన్ పార్టీ, పవన్ కల్యాణ్ పార్టీ : నారా లోకేష్

ఆ స్థానం సీపీఐ కి ఇస్తే మద్దతివ్వం .. స్థానిక కాంగ్రెస్ నేతల అల్టిమేటం

మహాకూటమి పార్టీ నేత అంత పని చేశాడా ? అందుకేనా ఈ లొల్లి

కూటమికి కోదండ రామ్ తో తలనొప్పులేనా ?

కామ్రేడ్లకు పవన్ ఇంత షాక్ ఇచ్చారేంటి ?