డియర్ కామ్రేడ్ సినిమాకి వచ్చిన మరో చిక్కు

Dear Comrade Movie Updates

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “డియర్ కామ్రేడ్” అనుకున్న ప్రకారం అయితే ఈ చిత్రం ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉంది కానీ కొన్ని సీన్స్ రీషూట్ మరియు ఇతర విషయాల కారణంగా సినిమాను కొంత ఆలస్యంగా విడుదల చేయనున్నట్లుగా మూవీ టీం ప్రకటించింది అలాగే వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు అయితే ఈ చిత్రంపై భారీగా అంచనాలున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ అవుతుంది ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ మూవీకి మంచి డిమాండ్ ఉంది

ఓవర్సీస్ లో డియర్ కామ్రేడ్ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయి అయితే ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే ఈ సినిమా విడుదల కాబోతున్న సమయంలోనే అదే రోజు హాలీవుడ్ మూవీ “ది లయన్ కింగ్” అనే చిత్రం కూడా విడుదల కానుంది మరియు ఆసక్తికర నేపథ్యంతో రాబోతున్న “ది లయన్ కింగ్” చిత్రంపై అక్కడి వారికి బారీ అంచనాలే ఉన్నాయి పైగా ఈ చిత్రం ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం కురిపించడం కాయం అని చెబుతున్నారు

విశ్లేషణ ప్రకారం చుస్తే ఓవర్సీస్ లో “ది లయన్ కింగ్” చిత్రానికే ఎక్కువ స్కోప్ ఉన్నట్టు తెలుస్తుంది అంటే దీని ప్రకారం చుస్తే డియర్ కామ్రేడ్ మూవీ కంటే లయన్ కింగ్ చిత్రానికే ఎక్కువగా మార్కెట్ ఉండబోతుంది కనుక డియర్ కామ్రేడ్ చిత్రానికి ఓవర్సీస్ లో ఎక్కువ థియేటర్లు లభించకపోగా విడుదలైనంత మేరకు కూడా ప్రేక్షకుల ఆదరణ తక్కువగా ఉంటుంది అన్ని చెబుతున్నారు విశ్లేషకులు ఇది ఇలా ఉంటే మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కి పోటీగా చాలానే ఉన్నాయి విజయ్ దేవరకొండకి పోటీ ఇవ్వగలిగే హీరోలు అయితే ఎవరు లేరు కానీ ఒకవేళ ఆ సమయానికి ఏ సినిమా అయినా క్లిక్ అయితే డియర్ కామ్రేడ్ కలెక్షన్లకి కోత పడే అవకాశం లేకపోలేదు

మంచి సినిమాకు మంచి విడుదల తేదీ ఉంటేనే ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టగలదు ఇప్పుడు డియర్ కామ్రేడ్ విడుదల తేదీ విషయమై బయ్యర్లు మార్చాలంటూ కోరుతున్నట్లుగా తెలుస్తుంది అయితే విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ముందు అవేవి పని చేయవని నిర్మాతలు మాత్రం మంచి ధీమాగా ఉన్నారు

 

Dear Comrade Movie Updates