‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్ …!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా ‘డియర్ కామ్రేడ్’ .విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు .. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు.. ‘గీత గోవిందం’ తరువాత ‘విజయ్ దేవరకొండ -రష్మిక మందన ‘జంటగా నటిస్తోన్న సినిమా ఇది . ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గా నటిస్తుండగా .. రష్మిక తెలంగాణ క్రికెటర్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించడంతో … ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది.

వరుస సినిమాలు చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతూ మంచి ఫామ్ లో ఉన్న విజయ్. ఈ సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు స్పీడ్ పెంచేస్తున్నాడు.తాజా సమాచారం ప్రకారం మే 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారు కావొచ్చని అంత భావిస్తున్నారు. ఇప్పటివరకు విజయ్ నటించిన ప్రతి సినిమాలోనూ వైవిధమైన పాత్రలను ఎంచుకుంటూ భిన్నమైన కథలతో ప్రేక్షకుల ను అలరిస్తున్నాడు.ఇలా ఒకదానికొకటి పూర్తి భిన్నమైన సినిమాలను చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఈ సినిమా కూడా తన కెరియర్లో గుర్తుంచుకోదగినది అవుతుందని ఆయన భావిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో సక్సెస్ ను రష్మిక తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.