ద్రౌపది పాత్రలో నటించనున్న పద్మావతి..!

అద్బుతమైన, ఊహకందని పాత్రలు, ఆశ్చర్యాన్ని కలిగించే విశేషాల సమాహారం మహాభారతం. కాగా దీన్ని బేస్ చేసుకుని గతంలో అనేక సినిమాలు రాగా ఇప్పుడు పలువురు దర్శకులు, నిర్మాతలు ఈ ఇతిహాసాన్ని తెరకెక్కించాలని చూస్తున్నారు. వారి జాబితాలో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా చేరింది. ఈ ప్రాజెక్టును నిర్మాత మధు మంతెనతో కలిసి నిర్మించనుంది దీపిక.

అంతేకాదు అందులో ప్రధానమైన ద్రౌపది పాత్రను పోషించనుంది. మహాభారతంలో ద్రౌపది పాత్ర ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ద్రౌపది పాత్ర లేని మహాభారతాన్ని ఊహించలేం. అందుకే ఈ సినిమా ద్రౌపది పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండనుంది. దీపిక ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఇది తనకు చాలా గొప్ప చిత్రమని, ద్రౌపది పాత్ర లైఫ్ టైమ్ క్యారెక్టర్ అని చెప్పుకొచ్చింది. ఇకపోతే రెండు లేదా అంతకన్నా ఎక్కువ భాగాలుగా రూపొందనున్న ఈ సిరీస్ నుండి మొదటి భాగాన్ని 2021 దీపావళికి రిలీజ్ చేస్తారట. అలాగే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది కూడా త్వరలోనే నిర్ణయించనున్నారు.