బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసి ఉంటే ..?

ntrbiopic,jr ntr

బయోపిక్ ప్రస్తుతం ట్రెండ్. గత సంవత్సరంలో మహానటి సినిమా చుసిన తరువాత ప్రేక్షకులు అంత వాళ్లకు నచ్చిన సినీ నాయకుల నుంచి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒక్కరి  బయోపిక్ కావాలనుకున్నారు. ప్రజలు, ప్రేక్షకులే కాదు హీరోలు, దర్శకులు అందరూ తియ్యడానికి ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు బయోపిక్ పేరు వింటుంటే చిరాకు వస్తుంది. అంతలా చేసారు మన సినీ దర్శకులు, హీరోలు.

ఈ నెల మొదటి వారంలో ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. ఈ సినిమాలో కధానాయకుడిగా బాలయ్య నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే నటన పరంగా బాలయ్య బాగా చేసిన తన తండ్రి ఎన్టీఆర్ వేషం సరికాలేదు బాలయ్యకు. అలాగే సినిమాలో ఎన్టీఆర్ వాయిస్ బాలయ్యది పెట్టడం తో బాలయ్య సినిమాల అయిపోయింది. దింతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంత కూడా బయోపిక్ లో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చెసింటే బాగుండు అని బాధపడ్డారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ నటించింతే అచ్చం మన పెద్దాయన నటించినట్టు కనిపించేది అని అభిమానులు చర్చించుకున్నారు. ఏది ఏమైనా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడం పెద్ద బాధాకరమైన విషయమే.