ఝాన్సీ ఆత్మహత్య వెనుక అసలు నిజం ….అన్ని రకాలుగా ఆమెను వాడుకొని ఆ పై ఇలా చేసాడు….ఆమె ప్రియుడు…?

jhansi-suicide

టీవీ సీరియల్ నటి ”పవిత్రబంధం” ఫేమ్ ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారంతో పాటు, ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్టు బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె మృతదేహం గాంధీ ఆసుపత్రిలో ఉండగా, గుడివాడలో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు.

ఇపుడు ఝాన్సీ మరణం పై అనేక అనుమానాలు వస్తున్నాయి.ఝాన్సీ మరణించడానికి ముందు ఆమె ఇంటికి ఓ యువకుడు వచ్చాడని, ఆపై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే కొత్త కొత్త సీరియల్స్ లో నటిస్తూ కెరీర్ మంచి స్వింగ్ లో ఉన్న ఈ తరుణంలో తాను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరం. మంచి అవకాశాలు దక్కించుకుంటూ, ఎదుగుతున్న క్రమంలో సదరు యువకుడితో లవ్ లో పడ్డ ఝాన్సీ, అతనికి డబ్బు సాయం కూడా చేసినట్టు తెలుస్తోంది. పెళ్లి వరకూ వచ్చేసరికి అతను మొహం చాటేయడం, డబ్బు అడిగితే, ఇవ్వబోనని చెప్పడం.అతన్ని పూర్తిగా నమ్మిన ఝాన్సీ అతనితో గత కొన్ని రోజులుగా డేటింగ్ కూడా చేసినట్టు సమాచారం.అన్నిరకాలుగా అతని చేతిలో మోస పోవడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం.

ఆత్మహత్యకు ముందు ఆమె తన కుటుంబ సభ్యులతోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది.కానీ ఈ విషయాలు ఏవి వారితో చెప్పకుండా దాచిపెట్టినట్టు తెలుస్తుంది. ఒక వేళ కుటుంబ సభ్యులతో ఈ విషయం చెప్పి ఉంటె ఇంత వరకు వచ్చి ఉండేది కాదు అని వారి ఆవేదన.ఇప్పటికే విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు.అందులో భాగంగా ఈ కేసును క్షుణ్ణంగా దర్యాఫ్తు చేస్తున్నామని, సాయి అపార్ట్ మెంట్స్ వాచ్ మెన్ ను ప్రశ్నిస్తున్నామని, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని పంజాగుట్ట పోలీసు అధికారి ఒకరు చెప్పారు.