దేవి శ్రీ ప్రేమ సరిగమలు…. ఎవరితోనో తెలుసా…..

devisri prasad

టాలీవుడ్ రాక్ స్టార్ దేవీప్ర‌సాద్ మ్యూజిక్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తన మెలోడీస్ తో మైకం లోకి దించుతాడు , మాస్ పాటలతో మత్తేక్కిస్తాడు. దేవి శ్రీ మ్యూజిక్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. అలాగే దేవి శ్రీ ప్రేమ వ్యవహారాలకు కూడా మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. ఆయన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలవటం కొత్తేమి కాదు. గ‌తంలో మ‌మ‌తా మోహ‌న్ దాస్‌తో వ‌రుస‌గా పాట‌లు పాడించిన దేవి , ఆ హాట్ భామ‌తో డేటింగ్‌లో ఉన్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత ఆ వార్త‌లో నిజం లేద‌ని తేలిపోయింది. ఇక ఆ త‌ర్వాత చార్మీతో ప్రేమ‌లో ఉన్నాడ‌ని ఇద్ద‌రు స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నార‌ని గాసిప్స్ గుప్పుమ‌న్నాయి. ఆ టైమ్‌లో ఇద్ద‌రూ స్పందించ‌క‌పోవ‌డంతో సినీ అభిమానులు నిజ‌మే అనుకున్నారు.ఇక తాజాగా మ‌రోభామ‌తో దేవి శ్రీ ప్ర‌సాద్ కొద్ది రోజులుగా ర‌హ‌స్యంగా ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతున్నార‌నే వార్త‌లు రెండు మూడు రోజులుగా జోరుగా ట్రాల్ అవుతున్నాయి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి ల‌వ‌ర్‌గా న‌టించింది పూజిత. ఆ చిత్రానికి దేవి సెన్షేష‌న్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ టైమ్‌లో పూజిత‌తో దేవీకి ప‌రిచ‌యం అవ‌డం.. ఇద్ద‌రు బాగా క్లోజ్ అవ‌డం, పీక‌ల్లో ప్రేమ‌లో మున‌గ‌డం అన్ని జ‌రిగిపోయాయ‌ట‌. మరి వీరిద్దరి ప్రేమ ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి.