ఐపీల్ లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ లేదు అంట ?

Do not have Delhi Daredevils in IPL?

ఐపీల్ అ మాట విన్నా ఆ పేరు చూసిన 64 రోజులు ఒక పండగ ఐపీల్ నుoచి ఒక టీమ్ మారిపోయింది. విజయాలకు ముఖం వాచిన జట్టేదైనా ఉంటే ముందుగా గుర్తొచ్చేది ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌. 2019 సీజన్‌లోనైనా తమ తలరాత మార్చుకోవాలని ఆ ప్రాంఛైజీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే అనూహ్య మార్పులు చేసింది. ‘ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌’గా ఉన్న పేరును ‘ఢిల్లీ క్యాపిట్సల్‌’గా మార్చింది. లోగో ఆకృతినీ సరికొత్తగా డిజైన్‌ చేసింది. డాలు మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పెద్ద అక్షరాలు, వాటి కింద మూడు ఎరుపు రంగు పులులు గాండ్రిస్తున్న చిత్రాన్ని ఉంచింది. పదకొండేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఆ జట్టు కేవలం మూడు సార్లు మాత్రమే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అన్నీ కుదిరినా ఆ జట్టుకు అచ్చిరాకపోయిన సందర్భాలెన్నో ఉన్నాయి.

Image result for ipl daredevils team
పేరు మార్పుతో పాటు జట్టుకు నాయకత్వం వహించేదెవరో ఢిల్లీ ప్రకటించింది. యువ ఆటగాడు, ముంబయి రంజీ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను సారథిగా ప్రకటించింది. గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు గౌతమ్‌ గంభీర్‌ సారథ్యం వహించాడు. అతడు ఫామ్‌లో లేకపోవడంతో శ్రేయస్‌కే పగ్గాలు అప్పగించారు. ఇప్పుడూ అతడినే కొనసాగిస్తున్నారు. శిఖర్‌ ధావన్‌ జట్టులోకి రావడం కలిసొస్తుందని ఆ జట్టు భావిస్తోంది. అలాగే రిషభ్‌పంత్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఢిల్లీకి ఆడాలని ఉందంటూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను వదిలేసి వచ్చిన గౌతీకి ఆ ఫ్రాంచైజీ మొండిచేయి చూపించింది. అతడిని వేలానికి వదిలేసింది.