రెహమాన్‌కి సంగీతం లో హెడ్ మాస్టర్ …..ఎవరో తెలుసా….

ar-rahman

తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌, మరో లెజెండరీ సంగీత దర్శకుడి పై తన కున్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. మాట్లాడింది ఎవరి గురించో కాదు. భారతీయ చిత్ర పరిశ్రమలో వెయ్యి కి పైగా సినిమాలకు సంగీతం అందించి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి… రెహమాన్ గారు ఇళయరాజాను ఉద్దేశించి మాట్లాడుతూ. “ఇళయరాజా నా హెడ్‌మాస్టర్‌”. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. ఆయన్ను తొలిసారి చూసినప్పుడు. ఇలాంటి వ్యక్తి కూడా ఉంటారా…? అని ఆశ్చర్యపోయా…..! ఆ తరువాత అర్థం అయింది ఆయనొక లెజెండ్ అని, నాలాంటి ఎంతో మంది సంగీత దర్శకులకు ఆయనొక గ్రంధాలయం లాంటి వారు. అంతే కాదు మా ఇద్దరికీ ఓ చెడ్డ అలవాటు ఉంది……అదే సంగీతం. నాకు అవార్డు ప్రకటించినప్పటి కన్నా కూడా ఇళయరాజా గారు ప్రశంసించినప్పుడే చాలా సంతోషపడుతుంటా…ఎందుకంటే, ఆయన అంత తేలిగ్గా ఎవర్నీ మెచ్చుకోరు. ఒకవేళ ప్రశంసించారంటే నిజంగానే ఆ వ్యక్తిలో అపారమైన ప్రతిభ ఉందని అర్థం చేసుకోవచ్చు’ అని రెహమాన్‌ చెప్పారు.

ఇదే కార్యక్రమంలో విశాల్‌ ప్రసంగిస్తూ……”పాలించడానికి ప్రతి రాజ్యానికీ ఓ రాజు ఉంటారు. కానీ సంగీతం విషయానికి వచ్చే సరికీ.. ఒకే ఒక్క రాజు ఉంటారు. ఆయనే ఇళయరాజా. చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాను. ఆయన సంగీతం నా మనసుని ప్రతి సారి కడిలిస్తునే ఉంటుంది.కార్లలో దూర ప్రయాణాలు చేయడానికి ఆయనే కారణం. కారులో పెట్రోల్‌ ఉందా అని చూసుకోవడానికి ముందు ఇళయరాజా పాటలు ఉన్నాయా…? అని చూసుకుంటుంటారు. ప్రజలు ఆయన సంగీతానికి అంతలా దగ్గరయ్యారు” అని విశాల్ పేర్కొన్నారు.