మునగాకు ( Drumstick Tree Leaves ) వల్ల ఎన్ని ఉపయోగాలో …..

Drumstick Tree Leaves

మునగాకు (Moringa Leaves ) వల్ల ఎన్ని ఉపయోగాలో

Drumstick Tree Leaves

 Drumstick Tree Leaves

మనం నిత్యం ఎన్నో పనుల్లో నిమగ్నమై ఆహరం మీద అశ్రద్ధ చూపిస్తున్నాం మనం తినే ఆహారం లో ఎన్ని పోషకాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు దొరికిందల్లా తినేయటం తిన్న తరువాత బాదపడటం సర్వ సాధారణం. దీనివల్ల తక్కువ వయసులోనే చూపు మందగించటం మరియు అనేకానేక రుగ్మతలకు లోనవుతుంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఇప్పుడు ఒక అద్భుత ఆహారం గురించి తెలుసుకోబోతున్నాం ఇది చాలామందికి తెలిసినదే కానీ దాని ఔషధ గుణాలు మరియు పోషక విలువలు మనకు చాలామందికి తెలియవు, తెలిసినా అది ఎలా తినాలో తెలియక చాలామంది దాన్ని విస్మరిస్తారు అదేనండి మునగాకు.

 Drumstick Tree Leaves

ఏళ్ళ నుంచి ఆయుర్వేదం లో మునగాకు ని వాడటం జరుగుతుంది మునగాకు వల్ల చాలా ఉపయోగాలు వున్నాయి అలాగే ఔషధ గుణాలు ఎన్నో. ఇప్పుడు మన శాస్త్ర పరిజ్ఞానం పెరిగిన తరువాత మునగాకు విశిష్టత తెలిసిందని చెప్పాలి. ఒక కప్పు మునగాకు అంటే 21 గ్రాముల లో

Protein: 2 grams
Vitamin B6: 19%
Vitamin C: 12%
Iron: 11%
Riboflavin (B2): 11%
Vitamin A (from beta-carotene): 9%
Magnesium: 8%

మునగాకు పచ్చిగా కంటే ఎండినతరువాత చాలా ఔషధ గుణాలు ఉంటాయి.

 Drumstick Tree Leaves pickle

మునగాకు వల్ల ఆరోగ్య ఉపయోగాలు

1. యాంటి ఆక్సిడెంట్స్ వల్ల హృదయ సంబంధ రుగ్మతలు తొలగిపోతాయి.
2. రక్తంలో చెక్కర శాతం అదుపులో ఉంచుతుంది.
3. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుంది.
4. కంటి చూపు మందగించినప్పుడు చాలా ఉపోయోగపడుతుంది
5. పిల్లల కి కూడా ఇది చాలా మంచిది.

ఎలా వాడాలి.

  1. మునగాకుని ఎండబెట్టి పొడిచేసుకుని వాడుకోవచ్చు.  ప్రొద్దున్నే ఒక స్పూన్ నీళ్ళల్లో కలిపి త్రాగవచ్చు.
  2. మునగాకుని కొద్దీ మోతాదూలో కూరల్లో వేసుకోవచ్చు రుచికి అనుగుణంగా.
  3. మునగాకు పచ్చడి గా కూడా చేసుకోవచ్చు.

మునగాకు పొడి ప్యాకెట్ రూపం లో కూడా మార్కెట్ లో దొరుకుతుంది.

అతిగా మునగాకు తినటం మంచిది కాదు. ఏ ఆహారం అయినా అతిగా తినటం ఆరోగ్యానికి హాని దాయకం.

Drumstick Tree Leaves

see also

http://www.teluguvilas.com/health-benefits-of-betel-leaves/