దుల్కర్ సల్మాన్ తో సినిమా చేయనున్న …యాత్ర దర్శకుడు dulkar-salman

dulkar-salman

dulkar-salman

dulkar-salman

వైఎస్ ఆర్ బయోపిక్ ‘యాత్ర’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడంతో….. ఆ సినిమా దర్శకుడికి వరుస పెట్టి అవకాశలు వస్తున్నాయి.వైఎస్ పాత్రలో మమ్ముట్టిని చాలా బాగా చూపించాడనే మంచి టాక్ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాను మమ్ముట్టి తనయుడు దుల్కర్ చూశాడట.ఈ సినిమా చూసిన వెంటనే ఆయన మహి.వి రాఘవ్ కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశాడని సమాచారం. అంతేకాదు అక్కడి తో ఆగకుండా …మంచి కథను సిద్ధం చేయండి .. తెలుగులో మన ఇద్దరి కామినేషన్లో ఒక సినిమా తప్పకుండా చేద్దామని హామీకూడా ఇచ్చారట. మలయాళ ,తమిళ ,తెలుగు,హిందీ భాషల్లో దుల్కర్ కి మంచి క్రేజ్ వుంది. అంతే కాదు మహానటి సావిత్రి సినిమాతో మనోడు తెలుగులో అభిమానులను సంపాదించుకున్నాడు.అలాంటి స్టార్ హీరో చుట్టూ కథ పట్టుకు తిరిగితే పని జరగడమే కష్టం. అలాంటిది ఆయనే చేస్తానని మాట ఇవ్వడం మరింత విశేషం.

వైఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన యాత్ర సినిమా విమర్శకుల యెక్క ప్రశసంలు కూడా అందుకుంది.ఈ నేపథ్యంలో ఆయతో కలిసి పని చేయడానికి చాల మంది నటి నటులు ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మలయాళ మెగా స్టార్ తనయుడితో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా తార స్థాయికి చేసుకుంటున్నాయి. ఈ అవకాశాన్ని మహి.వి రాఘవ్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.