పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్ : నలుగురు సైనికులు మృతి

pulwama

పుల్వామాలో సైనికులు, జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్లకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు సైనికులు, ఒక పౌరుడు మృతి చెందారని పోలీసులు తెలిపారు.పింగ్లాన్ ప్రాంతంలో జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్లు తలదాచుకున్నారన్న సమాచారం అందటంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సోదాలు జరిపారు.

సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్ల దాడి నేపథ్యంలో.. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలను సైన్యం, సీఆర్పీఎఫ్ ముమ్మరం చేశాయి.ఈ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన సైనికుడు గుల్జార్ మొహమ్మద్‌ను ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.మిలిటెంట్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.