మోడిలో కనపడని భయం…

Fear Not Seen In Modi, Telugu Vilasప్రధాని నరేంద్ర మోడీ భయాన్ని దాస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. 2014 ఎన్నికల సమయంలో ప్రధాని ప్రసంగాలకు అధిక ప్రాధాన్యత ఉండేది.. ఆయన కాంగ్రెస్ చేసిన అవినీతిని పదే పదే ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారం దూసుకు వెళ్ళే వారు. రాజకీయంగా మోడీ బలపడటానికి కూడా దాదాపుగా అదే కారణం అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఎన్నో హామీలు…

Related imageసాధ్యం కాని హామీలను ప్రజలకు ఇచ్చిన ప్రధాని వాటిని నిలబెట్టుకునే విషయంలో మాత్రం ఘోరంగా విఫలం అయ్యారనే చెప్పవచ్చు. దానికి తోడు స్వతంత్ర వ్యవస్థల విషయంలో కూడా రాజకీయ జోక్యం చూపించడంతో ప్రధాని తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన సీనియర్ల వెంటపడుతున్నారు. ఇన్నాళ్ళు తాను వదిలేసిన సీనియర్లను మళ్ళి దగ్గర చేసుకునే ప్రయత్నాలు మోడీ చేస్తున్నారు. దీని బట్టి చూస్తుంటే ఆయనలో కనపడని భయం ఉందనేది స్పష్టంగా అర్ధమవుతుంది.