సూర్యకాంతం ఫస్ట్ లుక్: పూర్తిగా సూర్యకాంతం ల మారిపోయిన నిహారిక

 

niharika,suryakantham

మెగా హీరోయిన్ నటించిన తాజా చిత్రం సూర్యకాంతం. ఒక మనసు తో సున్నితమైన ప్రేమకథ ద్వారా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. పొయెటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. హ్యాపీ వెడ్డింగ్ కూడా నిరాశ పరచడంతో కొంచెం గ్యాప్ తీసుకుని సూర్యకాంతం సినిమాలో నటించింది. రాహుల్ విజయ్ తో జత కట్టిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బైటికి తీసుకొచ్చింది మూవీ యూనిట్.
దూరదర్శన్ సింబల్ ను పోలి ఉన్న సింబల్ లో ఒక హాఫ్ వైట్ డిజైన్.. మరో సగం బ్లాక్ డిజైన్. వైట్ డిజైన్ లో ఇద్దరూ తెలుపు రంగులు దుస్తులు ధరించి ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. భుజానికి తెలుపు రంగు టాటూ లాంటి డిజైన్.. తలలో తెలుగు రంగు పూలతో నిహారిక ఎంతో ప్రేమతో హీరోను హగ్ చేసుకుంది. ఇక బ్లాక్ డిజైన్ లో మాత్రం ఒక రాక్షసి లాగా మారి హీరోను కుమ్మేసింది. అతని మోహాని పై గాయాలు కూడా ఉన్నాయి. పళ్ళు పటపటా కొరుకుతూ జుట్టు పట్టుకొని లాగుతోంది. అంటే సుర్యకాంతం పేరును ఫుల్ గా జస్టిఫై చేస్తోంది. న్యూ ఏజ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. మార్క్ రాబిన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి షార్ట్ ఫిలిం డైరెక్ట్ ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ని వరుణ్ తేజ్ ప్రెసెంట్ చేయడం విశేషం.