జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ అమ్రపాలీ ….!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంఎస్‌) అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అమ్రపాలికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను రాష్ట్ర ఎన్నికల సంఘానికి బదిలీ చేసింది.

ఎన్నికల నిర్వహణలో ఐటీ సంబంధిత వ్యవహారాలను చూడాలని ఆదేశించింది. ఇటీవల ఐటీ నిపుణులతో సమావేశం నిర్వహించిన సీఈసీ ఫేస్‌బుక్‌లో ప్రత్యేక పేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఓటు హక్కు వినియోగం, వీసీ ప్యాట్లపై ప్రజలకు పూర్తి అవగాహన కలిగించేందుకు డిజిటల్‌, సోషల్‌ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని యోచిస్తున్న ఎన్నికల సంఘం ఆ బాధ్యతలను చూసేందుకు అమ్రపాలీని నియమించింది. అమ్రపాలి 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి.