ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ కన్ను మూసారు….

GIRISH KARNAD

ప్రముఖ రంగ స్థల నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్(81) ఈ సోమవారం ఉదయం 6.30కి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని లావేలీ రోడ్‌లో ఉన్న తన నివాసంలో కన్నుమూశారు. తన రచనలకు గానూ పద్మ శ్రీ, పద్మ భూషణ్, జ్ఞానపీఠ్ సహా ఎన్నో అవార్డులు దక్కించుకున్న గిరీష్ పలు తెలుగు సినిమాల్లో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షక మనసులు దోచుకున్నారు.

GIRISH KARNAD