పచ్చి మిరపకాయలలో ఎన్నని పోషకాలు ఉన్నాయో మీకుతెలుసా.. Green Chilli Benefits

Green Chilli Benefits

పచ్చి మిరపకాయలో ఎన్నని పోషకాలు ఉన్నాయో మీకుతెలుసా.. Green Chilli Benefits

 

Green Chilli Benefits

చాలామందికి కారంగా ఉన్న వంటకాలంటే ఒక అపోహ ఉంటుంది కడుపులో మంటగాఉంటుంది అని అల్సర్లు వస్తాయి అని అంటూవుంటారు అయితే ఒకసారి మనం మన అమ్మ తాతమ్మ వాళ్ల వంటలు ఒక సారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చేసే వంటల్లో పచ్చి మిరపకాయలు లేనిదే వంటచెయ్యరు, రోజువారీ చేసే పట్చళ్లలో తప్పకుండా వీటిని వాడతారు రోటిపచ్చళ్ళు అనమాట. అయితే వాళ్ళు ఆ రోజుల్లోనే వీటిలో వున్న మంచి గుణాలను అర్ధంచేసుకుని రోజు వాడేవారు అందుకేనండి వాళ్ళు అంత గట్టిగా ఎంచక్కా చాల ఏళ్ళు బ్రతికేస్తారు.
ఇక అసలు విషయానికి వస్తే పచ్చి మిరపకాయలలో చాల పోషకగుణాలు వున్నాయి ఇవి ఎవరో చెప్పివని కావండి మన డాక్టర్లు మరియు శాస్త్రవేత్తలు చెప్పిన మాటలే యివ్వి. వీటిలో క్యాప్సిసిన్ (capsaicin ) అనే ఒక కెమికల్ ఉంటుంది దాని వల్లే ఇవ్వి అంత కారంగా ఉంటాయి. అయితే కారంగా ఉంటాయని ఉంటున్నాం కదా వీటిలోనే విటమిన్ B6, విటమిన్ A, విటమిన్ C, ఐరన్ , కాపర్ , పొటాషియం మరియు కొంచం మోతాదులో ప్రోటీన్ , కార్బోహైడ్రేట్స్ ఉన్నాయ్ ఇవ్వే మన ఆరోగ్యానికి చాల మంచివి . వీటిలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ శక్తికి దోహద పడుతుంది. చూసారా వీటిలో ఎన్ని మంచి గుణాలో.
ఐతే ఏ ఆహరం అయినా తగు మోతాదులో తింటేనే ఆరోగ్యం పోషకాలు ఉన్నాయ్ కదాని అతిగా తినకూడదు.

see also

http://www.teluguvilas.com/drumstick-tree-leaves-moringa-leaves-uses/