బాబు కు హరీష్ లేఖ … లేఖలో ఏముందంటే

harish letter.Telugu vilasతెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీల నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ఎత్తులు పై ఎత్తులతో రాజకీయం రసకందాయం లో పడింది. ఇక బాహాటంగా సాగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలే కాకుండా బహిరనగా లేఖలు సైతం ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయడంపై ప్రజలకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్న మంత్రి హరీష్‌రావు… చంద్రబాబుకు 19 ప్రశ్నలను సంధించారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. అసలు చంద్రబాబుకు తెలంగాణ పదమే గిట్టదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని హరీష్‌ ఆరోపించారు. కేంద్రానికి రాసిన లేఖలను బయటపెట్టారు. చంద్రబాబును చూసి… ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని, అంతలా రంగులు మారుస్తున్నారంటూ హరీష్‌ ఎద్దేవా చేశారు.. బాబుది ఎంత సంకుచిత ధోరణో, ఎంత మరుగుజ్జుతనమో… హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించి భవనాలను చూస్తే తెలుస్తుందన్నారు. . చంద్రబాబు… అప్పుడూ ఇప్పుడూ తెలంగాణ వ్యతిరేకేనన్న హరీష్‌రావు… తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

harishbabu,telugu vilas
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక్కడి ప్రజలందరికీ ఆనందం కలిగిస్తే, మీరు బాధ పడలేదా? విభజన మాయని గాయమని అనలేదా? గవర్నర్ ప్రసంగంలోనూ ఇదే విషయం చెప్పించి మీ కసి తీర్చుకోలేదా? ఇది మీకున్న తెలంగాణ వ్యతిరేకతకు నిదర్శనం కాదా? తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు మీరు చేసిన ద్రోహాల్లో, మీరు పన్నుతున్న కుట్రల్లో కొన్నింటిని మాత్రమే నేనిక్కడ ఆధారాలతో సహా బహిర్గతం చేశాను. తెలంగాణ ప్రగతి నిరోధకుడిగా మారిన మీకు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు ఉంటుందా? తెలంగాణను బలిపీటం ఎక్కించడానికి మీరు అధికారపీఠం కోరుకోవడం ఎంతటి రాక్షసత్వం? ఇదీ.. మంత్రి హరీష్‌రావు ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ రాసిన లేఖలోని సారంశం.
మరి హరీష్ లేఖకు చంద్రబాబు ఏ విధంగా సమాధానం ఇస్తారో వేచిచూడాలి.

Also Read : టీడీపీని టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ … సంచలన ట్వీట్స్

                 గూగుల్ ట్రెండ్ లో సెక్షన్ 49 p

                 డిజిటల్ ప్రచారం లో కాంగ్రెస్… టీఆర్ఎస్ కు స్పూఫ్ లతో పంచ్